జూ పార్కులో అభివృద్ధి పనులు చేపట్టాం: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-12-23T19:15:02+05:30 IST

నగరంలోని జూపార్కులో జంతువుల రక్షణ కోసం అభివృద్ధి పనులు, సందర్శకుల కోసం కొన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.

జూ పార్కులో అభివృద్ధి పనులు చేపట్టాం: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

హైదరాబాద్: నగరంలోని జూపార్కులో జంతువుల రక్షణ కోసం అభివృద్ధి పనులు,  సందర్శకుల కోసం కొన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..200సీసీ కెమెరాలు, జూలో అన్ని దేశాల జాతి పక్షులు కోటి 50లక్షలతో ప్రారంభించామన్నారు. హైదరాబాద్ జూ పార్క్‌కు ఐఎస్ఓ14001 మార్క్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. 4 వైల్డ్ డాగ్స్, సఫారీ జోన్‌లో ఏసీ బస్సులను ప్రారంభించామన్నారు. ఇతర దేశాల పక్షులు ఎన్నో రకాలు ఉన్నాయన్నారు.  కరోనా కారణంగా జూ మెయింటెనెన్స్‌కు కొంత ఇబ్బంది వచ్చిందన్నారు. జూను పూర్తిగా రినోవేట్ చేయించామని చెప్పారు. మీరాలం మండి చెరువు నీరు జూలోకి రావడంతో జంతువులకు హానికలిగిందన్నారు. జూ లోని పక్షులను చూడడానికి అన్ని రాష్ట్రాల నుంచి సందర్శకులు వస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2021-12-23T19:15:02+05:30 IST