వలస కూలీలను ఆదుకుంటాం : కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-05-18T10:22:39+05:30 IST

ఇతర రాష్ట్రాల నుం చి కాలి నడకన వస్తున్న వలస కూలీలను అ న్ని విధాల ఆదుకుంటామని కలెక్టర్‌ పోలా భాస్కర్‌

వలస కూలీలను ఆదుకుంటాం : కలెక్టర్‌

కందుకూరు, మే 17 : ఇతర రాష్ట్రాల నుం చి కాలి నడకన వస్తున్న వలస కూలీలను అ న్ని విధాల ఆదుకుంటామని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ భరోసా ఇచ్చారు. చెన్నై నుంచి జా తీయ రహదారిపై నడిచి వెళ్తున్న వంద మంది కూలీలను గుడ్లూరు మండలం చేవూరు వద్ద అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న కలెక్టర్‌ చేవూరు చేరుకొని కూ లీలతో మాట్లాడారు.


వీరిని ఒంగోలులోని పేస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలకు ఆర్టీసీ బస్సుల్లో తర లించే కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభిం చారు. నడిచి వస్తున్న వలస కూలీలకు తా త్కాలిక ఆశ్రయం కల్పించి, సురక్షితంగా వారి ఇళ్లకు పంపించే ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ చెప్పారు. ఆదివారం 7 ఆర్టీసీ బస్సుల్లో ఒడిశా కూలీలను తరలించామని ఆయన తెలిపారు. సుదూర రాష్ట్రాల వారిని రైళ్ల ద్వారా పంపి స్తామని, అప్పటి వరకూ ఆశ్రయం కల్పిస్తామ ని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌, కందుకూ రు ఆర్డీవో ఓబులేశు పాల్గొన్నారు. 


మూడు బస్సు ద్వారా... 

ఒంగోలురూరల్‌ : ఒంగోలులోని తహసీ ల్దార్‌ కార్యాలయం వద్ద నుంచి ఆదివారం రెం డు ప్రైవేటు బస్సుల ద్వారా పశ్చిమబెంగాల్‌కు చెందిన 60 మంది కార్మికులు తరలివెళ్ళారు. ముందుగా డాక్టర్‌ ప్రియాంక వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్మికులు కోల్‌కత్తా వెళ్లేందు కు ఒక్కొకరు రూ.4వేలు చెల్లించారు. కొప్పోలు షిర్డిసాయి బాబా ఆలయ కమిటీ వారు భోజ నం అందించారు. అలాగే శ్రీకాకుళం, విజయ నగరం జిల్లాలకు ఆర్టీసీ బస్సుల్లో 40 మంది  వలస కార్మికులను ఒక ఆర్టీసీ బస్సు తరలిం చారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కె.చిరంజీవి పాల్గొన్నారు.

Updated Date - 2020-05-18T10:22:39+05:30 IST