బాధితులను ఆదుకుంటాం

ABN , First Publish Date - 2020-04-09T10:45:12+05:30 IST

వడగండ్ల వానకు నష్టపో యిన వరి రైతులను ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు

బాధితులను ఆదుకుంటాం

ఖిల్లాఘణపురం: వడగండ్ల వానకు నష్టపో యిన వరి రైతులను ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి కురిసిన వడగండ్ల వానకు వనపర్తి జిలా,్ల ఖిల్లా ఘణపురం మండలంలో దాదాపు 11వేల ఎకరాలకు పైగా వరి సాగు చేయగా అందులో 2500 ఎకరాలకు పైగా వరిపంట నేలరాలింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. విషయం తెలుసుకున్న మంత్రి  బుధవా రం  సోళీపూర్‌, అల్లమాయ పల్లి, తిరుమలాయ పల్లి గ్రామాలలో పర్యటించి రైతులతో మాట్లాడారు. వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం వచ్చేలా కృషిచేస్తానని రైతులకు ఆయన భరోసానిచ్చారు. చేతికొ చ్చిన పంటలు నేలరాలడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనకు దర ఖాస్తు చేసుకున్న రైతులను గుర్తించి నివేదిక తయారు చేయాలని వ్యవసాయ అధికారులకు ఆయన సూచించారు.


భీమా వర్తించని రైతులను కూడ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి న్యాయం చేస్తానని రైతులకు హామి ఇచ్చారు. మండల కేం ద్రంలో హైడ్రోజన్‌ సోడి యం హైపో క్లోరైడ్‌ ద్రా వణాన్ని మంత్రి స్ర్పే చేశారు. అదృష్టవశాత్తు వనపర్తి జిల్లాకు కరోనా సోకలేదని గుర్తు చేస్తూ ప్రజలు నిర్లక్ష్యంగా ఉం డకూడదని తెలిపారు. ఎంపీపీ కృష్ణానాయక్‌, జడ్పీటీసీ సామ్యనా య క్‌, సింగిల్‌విండో అధ్య క్షుడు మురళీధర్‌రెడ్డి, ఉ పాధ్యక్షుడు క్యామరాజు, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు విక్రమ్‌ పా ల్గొన్నారు.

Updated Date - 2020-04-09T10:45:12+05:30 IST