అప్పన్న భూముల లెక్కలు తేలుస్తాం..

ABN , First Publish Date - 2020-10-20T09:17:00+05:30 IST

సింహాద్రి అప్పన్న స్వామికి చెందిన భూములన్నింటినీ సమగ్రంగా పరిశీలించి వాస్తవాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని సింహాచల దేవస్థానం భూముల

అప్పన్న భూముల లెక్కలు తేలుస్తాం..

స్పెషల్‌ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టిన ఎస్‌డీసీ సురేంద్ర

సింహాచలం, అక్టోబరు 19: సింహాద్రి అప్పన్న స్వామికి చెందిన భూములన్నింటినీ సమగ్రంగా పరిశీలించి వాస్తవాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని సింహాచల దేవస్థానం భూముల స్పెషల్‌ డ్రైవ్‌కు ప్రభుత్వం నియమించిన నూతన ఎస్‌డీసీ ఎం.సురేంద్ర పేర్కొన్నారు.

రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్‌ పండా అర్జునరావు ఆదేశాల మేరకు సోమవారం స్పెషల్‌ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టారు. ముందుగా ఈవో వాండ్ర త్రినాథరావు, డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న సర్వేయర్‌ సాయికృష్ణ, భూ పరిపాలన విభాగం ఏఈవో ఎన్‌.ఆనందకుమార్‌లతో కలిసి మ్యాప్‌లు, రికార్డులను పరిశీలించి ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. 

అనంతరం సురేంద్ర మీడియాతో మాట్లాడుతూ దేవస్థానానికి పంచగ్రామాలలోనే కాకుండా మరో పది గ్రామాల్లో కూడా భూములున్నాయని, సర్వే నంబర్లలో రికార్డుల ప్రకారం ఉండాల్సిన భూమి ఎంత, ప్రస్తుతం దేవస్థానం ఆధీనంలో ఎంత ఉంది, ఏ మేరకు ఆక్రమణలకు గురయ్యాయి, ఎన్ని అనధికార నిర్మాణాలు చోటు చేసుకున్నాయనే అంశాలను తెలుసుకుంటాన్నారు.


అన్ని సర్వే నంబర్లలోని భూమిని పరిశీలించి.. వాటి సరిహద్దులు, ఆక్రమణలు, అనధికార నిర్మాణాలపై అధ్యయనం చేస్తామన్నారు. తమ స్పెషల్‌ డ్రైవ్‌లో దేవదాయశాఖ జోన్‌-2కు చెందిన తహసీల్దార్‌ శిరీషాదేవి సారథ్యంలో ప్రత్యేక సర్వే బృందంతోపాటు దేవస్థానానికి చెందిన భూ పరిరక్షణ విభాగంలోని అధికారుల సహకారం తీసుకుంటామని పేర్కొన్నారు. రెండు రోజుల పాటు క్షేత్ర పరిశీలన చేశార సిబ్బందిని పెంచుకునే అంశం, పరిశీలనకు కాలపరిమితుల గురించి యోచిస్తామన్నారు. తాము జరిపే స్పెషల్‌ డ్రైవ్‌ నివేదిక భవిష్యత్తులో పంచగ్రామాల భూ వివాద పరిష్కారానికి ఎంతో దోహదపడుతుందన్నారు. 


Updated Date - 2020-10-20T09:17:00+05:30 IST