Advertisement
Advertisement
Abn logo
Advertisement

అంతా మా ఇష్టం..

సచివాలయాల్లో సమయపాలన కరువు 

కొరవడిన పర్యవేక్షణ 

స్థానికంగా నివాసం ఉండని సిబ్బంది 

ప్రజలకు తప్పని ఇబ్బందులు

మార్కాపురం, డిసెంబర్‌ 3: ప్రజల వద్దకు పాలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ఆచ రణలో అభాసుపాలవుతోంది. ప్రభుత్వ నిబంధన మేరకు సచివాలయ సిబ్బంది ఉదయం 10 గంటల నుంచి సాయం త్రం 5 గంటల వరకూ విధులు నిర్వహించాలి.  సిబ్బంది కార్యాలయానికి ఎప్పుడు వస్తారో? ఎప్పుడు వెళ్తారో? తెలి యని పరిస్థితి. మార్కాపురం 10వ సచివాలయాన్ని శుక్ర వారం విజిట్‌ చేయగా ఏడుగురు సిబ్బంది విధులకు హా జరయ్యారు. హాజరైన వారు కూడా సమయపాలన పాటిం చలేదు. మార్కాపురం, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలలో ఆంధ్రజ్యోతి విజిట్‌ చేయగా ఎక్కువ సచివాలయాలలో ము గ్గురు లేక నలుగురు సిబ్బంది మాత్రమే విధులు నిర్వహి స్తున్నారు. మిగిలిన వారి గురించి అడిగితే ఫీల్డ్‌ విజిట్‌, ఉన్నతాధికారి రమ్మటే వెళ్లారు వంటి సమాధానాలు వచ్చా యి. ఫీల్డ్‌ విజిట్‌కు వెళ్లే సిబ్బంది సంబంధిత రిజిష్టర్‌లో రాసిన దాఖలాలు లేవు.

గ్రామీణ ప్రాంత సచివాలయాలలో పనిచేసే సిబ్బంది స్థానికంగా నివాసముండాలి. కానీ ఎక్కడా అమలు జర గడం లేదు. మార్కాపురం, తర్లుపాడు, పెద్దారవీడు, దోర్నా ల మండలాలలో పనిచేసే సచివాలయ సిబ్బంది మార్కా పురం పట్టణంలో నివాసముంటున్నారు. కొనకనమిట్ట, పొదిలి మండలాల సిబ్బంది పొదిలిలో, ఎర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాల సిబ్బంది ఎర్రగొండపాలెంలో ని వాసముంటున్నారు. గ్రామ సచివాలయ సిబ్బందికి వలం టీర్లు చెప్పిందే వేదంగా మారింది. ప్రజలు నేరుగా వచ్చి అర్జీలు ఇచ్చినా మీ వార్డు వలంటీర్‌కు ఇవ్వండని సిఫార్సు చేస్తున్నారు. అర్జీదారుడు అధికారపార్టీకి చెందిన వ్యక్తి అయితే ఇబ్బంది ఉండదు. కాకపోతే అర్జీ బుట్టదాఖలే.

అరకొర వసతులు

త్రిపురాంతకం, డిసెంబరు 3: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మేలైన పాలనను ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటుచేసిన సచివాలయ వ్యవస్థలో సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో అబా సుపాలవుతుంది.  శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’ పలు సచి వాలయాలను విజిట్‌ చేయగా, సిబ్బంది తీరు బహి ర్గతమైంది. పాతఅన్నసముద్రంలో  11 మంది సిబ్బందికిగానూ ఒకరు సెలవులో ఉండగా, కేవలం నలు గురు మాత్రమే ఉదయం  10.30 గంటలకు విధులకు హాజరయ్యారు. మిగిలిన వారిలో ఏఒక్కరూ అందుబాటులో లేకపోవడం సిబ్బంది పనితీరుకు, నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. 

మిరియంపల్లి గ్రామ సచివాలయంలో ఇద్దరు మా త్రమే 10.05 గంటలకు విధులకు రాగా 10.30 తర్వాత, 11.30 లోపు ఐదుగురు హాజరై బయో మెట్రిక్‌ వేశారు. మరో ముగ్గురు సి బ్బంది విధులకు హాజరు కాలేదు. దీనికితోడు గ్రామంలో నిర్వహిస్తున్న సచివాల యం ఇరుకైన అద్దె ఇంట్లో ఉండడం, సౌకర్యాలు లేకపోవడంతో సిబ్బందికి, ప్రజలకు సమస్యగా మారింది. 

ఎర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో సచివాలయాలు  ఉద్యోగులు సమయపాలన పాటించ డంలేదు. శుక్రవారం ఆంధ్రజ్యోతి ప లు సచివాలయాలను విజిట్‌ చేయ గా, పలు విషయాలు వెలుగుచూశా యి.  ఎర్రగొండపాలెం మండలం మి ల్లంపల్లి  గ్రామసచివాలయంలో 11 మంది ఉద్యోగులకుగాను ఉదయం  10.30 గంటలకు ఐదుగురు మాత్రమే హాజరయ్యారు.  

సగం మందే హాజరు..

గిద్దలూరు టౌన్‌, డిసెంబరు 3: పట్టణంలోని సచివాలయాలను ఆం ధ్రజ్యోతి విజిట్‌ చేసిన సందర్భంలో సిబ్బంది సంఖ్య నామమాత్రంగా కనిపించింది. 9వ సచివాలయంలో సిబ్బంది ఉండగా ఇన్‌చార్జి లేరు. అర్భన్‌కాలనీలో 7వ సచివాలయాన్ని విజిట్‌ చేయగా వీధిలైట్లు కాలిపోయిన సందర్భంలో కొత్తవాటి ఏర్పాటు కోసం సచివాలయం చుట్టూ పలు పర్యాయాలు తిరగాల్సి వస్తుందని చట్రెడ్డిపల్లివాసులు వాపోయారు. ఈ విషయంగా సచివాలయ ఇన్‌చార్జి ఉమామహేశ్వర్‌రెడ్డిని వివరణ కోరగా వీధిలైట్లు వెంటనే వేయాలని సంబంధిత సిబ్బందికి చెప్పినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం వలన ఇలాంటి సమస్యలు అప్పుడప్పుడు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. 9, 8 సచివాలయాలలో ప్రజలకు సరఫరా చేయాల్సిన డస్ట్‌బిన్లు మూలనపడి ఉన్నాయి. కొంతమందికి పంపిణీ చేశామని, మిగతావి పంపిణీ చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

వాట్సప్‌లో సెలవు చీటి

రాచర్ల, డిసెంబరు 3 : రాచర్ల మండలంలోని సత్యవోలు, యడవల్లి సచివాలయాల్లో ఉదయం 10.40గంటలకు సిబ్బంది రావడం ప్రారంభించారు. సత్యవోలు సచివాలయంలో ఆర్‌బీకేలో పని చేస్తున్న అగ్రికల్చర్‌ అధికారి నిబంధనల ప్రకారం సెలవు చీటి సంబంధిత పంచాయతీ కార్యదర్శికి ఇవ్వాల్సి ఉండగా, కొద్ది రోజుల క్రితం వాట్సప్‌ పంపినట్లు పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్‌ తెలిపారు. దీనితో 11 రోజులపాటు ఆమె జీతాన్ని ఆపినట్లు  తెలిపారు.  యడవల్లి సచివాలయంలో వీఆర్వో రంగయ్యనాయుడు వారానికి రెండు రోజులు మాత్రమే వస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి సురేష్‌ తెలిపారు. రెవిన్యూ సమస్యలపై వచ్చే అర్జీలు అతని దగ్గరే ఉన్నాయని, ముఖ్యంగా స్పందన అర్జీలు కూడా అతని దగ్గరే ఉండడంపై బాధితులు సచివాలయం చుట్టూ తిరుగుతున్నారన్నారు. 

సిబ్బంది గైర్హాజరు

కంభం, డిసెంబరు 3: కంభం, అర్థవీడు మండలాల్లోని పలు సచివాలయాల్లో సిబ్బంది గైర్హాజరవుతున్నారు. అర్థవీడు మండలం నాగులవరం సచివాలయాన్ని ఉదయం 11.00 గంటలకు విజిట్‌ చేయగా కార్యదర్శి రాజశ్రీ, డిజిటల్‌ అసిస్టెంట్‌, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ తదితర సిబ్బంది ఉ న్నారు.  సర్వేయర్‌, వీఆర్వోలు పని మీద బయటకు వెళ్ళినట్లు తెలిపారు. సిబ్బంది ఎక్కడికి వెళ్ళినా మూమెంట్‌ రిజిష్టర్‌లో రాస్తారని తెలిపారు. కంభం పంచాయతీ పరిధిలోని సచివాలయం-3లో డిజిటల్‌ అసిస్టెంట్‌, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ మాత్రమే ఉన్నారు. మహిళ పో లీసు సెలవు పెట్టిందని, సర్వేయర్‌ మార్కాపురం ట్రైనింగ్‌కు వెళ్ళాడని, కార్యదర్శి వెంకటరెడ్డి ఫీల్డ్‌కు వెళ్ళారని, యర్రబాలెం వీఆర్వో మస్తాన్‌వలి ఇన్‌ఛార్జిగా ఉన్నట్లు, ఆయన మధ్యాహ్నం వస్తారని తెలిపారు. కందులాపురం-3 సచివాలయంలో ఇద్దరు ముగ్గురు సిబ్బంది అందుబాటులో లేరు.

ఒకే కార్యాలయంలో పాట్లు

పెద్ద దోర్నాల, డిసెంబరు 3: ఒకే కార్యాలయంలో పంచాయతీ, రెండు సచివాలయాల నిర్వహణ జరుగుతోంది. ఒక సచివాలయం సిబ్బంది పని చేస్త్తే మరో సచివాలయం సిబ్బంది పక్కన ఉండాలి.. ఇదీ దోర్నాల-1, చింతల సచివాలయాల పని తీరు. దోర్నాల పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ సిబ్బందితో పాటు. దోర్నాల-1 సచివాలయం సిబ్బంది కూడా విధులు నిర్వహిస్తున్నారు. సచివాలయం కోసం నిర్మిస్తున్న ప్రత్యేక భవన నిర్మాణం పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి.  చింతల గిరిజన గ్రామం నల్లమల అటవీ ప్రాంతంలో ఉండడం వల్ల ఆన్‌లైన్‌ పని చేయకపోవడంతో అక్కడి సచివాలయం కూడా దోర్నాల పంచాయతీ కార్యాలయంలోనే కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తోందని అధికారులు తెలిపారు.దీంతో సరిపడ వసతులు లేక పంచాయతీ, 2 సచివాలయాల సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.

నెట్‌లేక అవస్థలు

పుల్లలచెరువు, డిసెంబరు 3: ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠత్మకంగా తీసుకొచ్చిన  గ్రామ సచివాలయాలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి.శుక్రవారం మండలంలోని నాయుడుపాలెం గ్రామ సచివాలయాన్ని విజిట్‌ చేయగా పలు విషయాలు వెలుగులోకి వ చ్యాయి.  సిబ్బందికి  నెట్‌ వసతి లేక ఇబ్బందులు పడుతున్నారు. హాట్‌స్పాట్‌ ద్వారా సిబ్బంది నెట్‌ సేవలు వినియోగిస్తుండటంతో పలుసార్లు కంప్యూటర్లు మొరాయిస్తున్నాయి. 

 ప్రజల పడిగాపులు

కొనకనమిట్ల, డిసెంబరు 3: మండలంలోని సచివాల యాల్లో సిబ్బంది సమయ పాలన లేకుండా విధులకు గైర్హా జరు అవుతున్నారు. ఉదయం 10 గంటలకు చినారికట్ల స చివాలయానికి వీఆర్‌వో, డిజిటల్‌ అసిస్టెంట్‌, గ్రామ పోలీస్‌, ఏఎన్‌ఎంలు  వచ్చారు. మిగిలినవారు 10.50 వరకు వస్తూ ఉన్నారు. పెదారికట్ల సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌, వీఆర్వోలు సెలవులో ఉండగా 10.30గంటలకు మిగిలిన సి బ్బంది హాజరయ్యారు. సచివాయాలలో సిబ్బంది సమయ పాలన లేకపోవడంతో  ప్రజలు వారికోసం ఎదురుచూపులు చూస్తున్నారు.

విధుల నిర్వహణలో అలసత్వం

పొదిలి, డిసెంబరు 3:  విధుల నిర్వహణలో సచివాలయ సిబ్బంది అలసత్వం వహిస్తున్నారు. పొదిలి 1వ సచివాల యంలో శుక్రవారం ఉదయం 10.10లకు కేవలం అగ్రికల్చర్‌, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ మాత్రమే విధులకు హాజరయ్యారు. 4వ సచివాలయంలో 11.20కి  ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌, డిజిటల్‌ అసిస్టెంట్‌, మహిళా పోలీ సు మాత్రమే విధులలో ఉన్నారు. అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ రెండు నెలల క్రితం రిజైన్‌ చేశారని, మిగిలినవారు ఓటీఎస్‌ పనిపై  వెళ్ళారని చెప్పారు. 12గంటలకు రెండవ సచివాలయం విజిట్‌ చేయగా సర్వేయర్‌ మెడికల్‌ లీవ్‌లో ఉన్నారని వీఆర్వో ఆరునెలలుగా లీవ్‌ తీసుకొని పన్నూరుకు బదిలీ అయ్యారని చెప్పారు.

అందరూ క్యాంపులలో..

పొదిలి రూరల్‌, డిసెంబరు 3: మండలంలోని సచి వాలయాల్లో పనుల కోసం వచ్చే ప్రజలు సిబ్బంది కోసం పడిగాపులు కాస్తున్నారు. ఏలూరు గ్రామ సచివాలయంలో 10.28కి  డిజిటల్‌ అసిస్టెంట్‌, సర్వేయర్‌, ఇంజనీర్‌ అసిస్టెం ట్‌ మాత్రమే కార్యాలయానికి వచ్చారు. తళమళ్ళలో 11.42 లకు ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌, అగ్రీకల్చర్‌ అసిస్టెంట్‌, ఏఎ న్‌ఎం, వెల్‌ఫేర్‌ అసిస్టెంట్‌  మాత్రమే ఉన్నారు. మిగిలిన వారు ఫీల్డ్‌ విజిట్‌లో ఉన్నారని చెప్పారు. 

Advertisement
Advertisement