సర్వం కోల్పోయాం.. ఎలా బతకాలి?

ABN , First Publish Date - 2021-11-27T06:26:52+05:30 IST

చిత్రావతి వరదనీరు మా ఇళ్లలో చేరటంతో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలాం. అధికారులు ఎలాంటి సహాయం చేయలేదు. మేమెలా బతికేదని’ సాయినగర్‌ ప్రజ లు జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి ఎదుట వా పోయారు

సర్వం కోల్పోయాం.. ఎలా బతకాలి?
కలెక్టర్‌తో మాట్లాడుతున్న సాయినగర్‌ వాసులు


కలెక్టర్‌ ఎదుట వరద బాధితుల ఆవేదన 

బాధితులందరికీ పరిహారం : కలెక్టర్‌  


పుట్టపర్తి, నవంబరు 26: ‘చిత్రావతి వరదనీరు మా ఇళ్లలో చేరటంతో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలాం. అధికారులు ఎలాంటి సహాయం చేయలేదు. మేమెలా బతికేదని’ సాయినగర్‌ ప్రజ లు జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి ఎదుట వా పోయారు. చిత్రావతి ముంపునకు గురైన సాయినగర్‌ను శుక్రవారం జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా సాయినగర్‌ వాసులు వరదతో జరిగిన నష్టాన్ని కలెక్టర్‌కు వివరించారు. వరదనీరే కాకుండా డ్రై నేజీ నీరు వీధుల్లోకి వస్తోందని, శాశ్వత పరిష్కారం చూపాలని కో రారు. పరిశీలించి తిరిగి వెళ్తున్న కలెక్టర్‌తో వారం రోజుల నుండి తాము కష్టాలు పడుతుంటే మీరు చూసి వెళ్తే మా  సమస్యకు  పరిష్కారం దొరుకుతుందా, బురదగుంటలోనే బతకాలా అంటూ వాదనకు దిగారు.  దీంతో బాధితులందరికీ పరిహారం అందిస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. కమిషర్‌ శివరామిరెడ్డి జరిగిన నష్టాన్ని, చేపట్టిన సహాయక చర్యలను వివరించారు. తరచూ అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నీరు పొంగిపొర్లి వీధుల్లో పారుతోందని,  డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. చిత్రావతి ఆక్రమణలను తొ లగించాలని, తద్వారా నష్టపోయిన వారికి వేరొక చోట ప ట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నష్టపోయిన ప్రతి కుటుంబానికి 10వేల చొప్పున ఆర్థిక సహాయక అందించాలని జనసేన నాయ కులు అబ్దుల్‌, డాక్టర్‌ తిరుపతేంద్ర కలెక్టర్‌ను కోరారు. అంతకుముందు కోతకు గురైన చిత్రావతి చెక్‌డ్యాం మరమ్మతు పనులను పరిశీలించారు త్వరగా మరమ్మతు పనులను పూర్తిచేయాలని ఇరిగేషన డీఈ రాజ్‌కుమార్‌ను ఆదేశించారు. పట్టణానికి దిగువ ప్రాంతంలో ప్రభుత్వ భూమిని కబ్జాచేసి నదికి అడ్డంగా వేయడంతో వరదనీరు పట్టణంలోకి వచ్చిందని కబ్జాను తొ

లగించాలని మున్సిపల్‌ మాజీ చైర్మన పీసీగంగన్న, టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ రత్నప్ప చౌదరి, రైతులు కలెక్టరును కోరారు.  కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన తుంగ ఓబుళపతి, ఆర్డీఓ వెంకటరెడ్డి, పుడాచైర్మన లక్ష్మీనరసమ్మ, నెట్కోడైరెక్టర్‌ మా ధవరెడ్డి, కౌన్సిలర్లు భాస్కర్‌రెడ్డి, నాయకులు కన్వీనర్‌ గం గాద్రి, బిల్డర్‌ మల్లి, నారాయణరెడి,్డ లింగా భాస్కర్‌రెడ్డి, కడపరాజా, బీడుపల్లి రంగారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-11-27T06:26:52+05:30 IST