పేదల క్షుద్బాధ తీర్చేందుకు పిల్‌ విచారిస్తాం

ABN , First Publish Date - 2021-10-23T08:04:34+05:30 IST

రుపేదల క్షుద్బాధ తీర్చేందుకు, పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు ఉమ్మడి వంటశాలల ఏర్పాటుకు సంబంధించిన వ్యాజ్యంపై సత్వర....

పేదల క్షుద్బాధ తీర్చేందుకు పిల్‌ విచారిస్తాం

27న విచారణ చేపడతాం: సీజే రమణ

న్యూఢిల్లీ, అక్టోబరు 22: నిరుపేదల క్షుద్బాధ తీర్చేందుకు, పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు ఉమ్మడి వంటశాలల ఏర్పాటుకు సంబంధించిన వ్యాజ్యంపై సత్వర విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దీనిపై ఈనెల 27న విచారణ చేపడతామని చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం శుక్రవా రం తెలిపింది. ముగ్గురు సా మాజిక కార్యకర్తలు దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయవాది ఎం.అశీమ వాదించా రు.కొవిడ్‌ మహమ్మారి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో నిరుపేదలకు ఉచితంగా పట్టెడన్నం పెట్టేందుకు ఉమ్మడి వంటశాలలు(కమ్యూనిటీ కిచెన్లు) ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు. ఇదే పిల్‌పై గతంలో జస్టిస్‌ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టి రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులిచ్చింది. ఉచిత వంటశాలలపై తమ ఆదేశాలను పాటించని 6 రాష్ట్రాలకు రూ.5 లక్షల చొప్పున అదనపు జరిమానా విధిస్తూ ధర్మాసనం నిరుడు ఫిబ్రవరి 17న ఆదేశాలిచ్చింది. పేదల క్షుద్బాధ తీర్చేందుకు ఉమ్మడి వంటశాలలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని 2019 అక్టోబరు 18న జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీనికి సంబంధించి ఒక పథకం అమలుపై సమాధానం ఇవ్వాల్సిందిగా అప్పట్లో ధర్మాసనం కేంద్రానికి, అన్ని రాష్ట్రాలకు నోటీసులిచ్చింది. 


Updated Date - 2021-10-23T08:04:34+05:30 IST