Abn logo
Sep 22 2021 @ 13:49PM

అఘాయిత్యాలకు వ్యతిరేకంగా ఉమ్మడిగా పోరాడాలి: వాసిరెడ్డి పద్మ

విజయవాడ: మహిళలు, యువతులు, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా రాజకీయాలకు అతీతంతా ఉమ్మడిగా పోరాటం చేయాలని మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ నేషనల్ మహిళా కమిషన్ ఇచ్చే పోషకాహారం కార్యక్రమంలో భాగంగా పలు జైళ్లను సందర్శించినట్లు చెప్పారు. అన్ని రంగాల్లోని మహిళల సమస్యలపై మహిళ కమిషన్ దృష్టి పెట్టిందన్నారు. బాలికల విద్య పట్ల నిర్లక్ష్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వ్యాఖ్యానించారు. అసంఘటిత రంగంలో మహిళలపై జరిగే లైంగిక వేధింపులపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు.


బాలికలపై అఘాయిత్యాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం దృష్టికి రాని అంశాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు అన్ని యూనివర్సిటీలలో నారీ-భేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళా సాధికారత సాధించడానికి పలు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రాజకీయంగా బురద చల్లుకోవడం కాకుండా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఉమ్మడిగా పోరాడాలని పిలుపునిచ్చారు. కన్నతండ్రులే అఘాయిత్యాలకు పాల్పడడం తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో ప్రత్యేక చట్టం తీసుకొచ్చేందుకు ఆలోచిస్తున్నట్లు వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption