Advertisement
Advertisement
Abn logo
Advertisement

సమాజ శ్రేయస్సుకు పాటుపడాలి

అట్టహాసంగా 73వ ఎన్‌సీసీ డే వేడుకలు

ఆకట్టుకున్న ప్రదర్శన

నారాయణపేట క్రైం, నవంబరు 30 : ఎన్‌సీసీ క్యాడెట్లలో ఉత్తమైన లక్షణాలు ఉంటాయని, ప్రతీ ఒక్క క్యాడెట్‌ సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని వక్తలు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం 73వ ఎన్‌సీసీ డే వేడుకలను ప్రిన్సిపాల్‌ మెర్సీవసంత అధ్యక్షతన ఎన్‌సీసీ సీటీవో డాక్టర్‌ శంకర్‌ నేతృత్వంలో ఘనంగా జరిగాయి. ముందుగా సరస్వతీ దేవి చిత్ర పటానికి పూజ చేసి, ఎన్‌సీసీ పతాకావిష్కరణ అనంతరం వేడుక లను ప్రారంభించారు. ఎన్‌సీసీ క్యాడెట్ల గౌరవవందన సమర్పణ, గన్‌ పరేడ్‌ ప్రదర్శన వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ప్రినిపాల్‌  మెర్సివసంత మాట్లాడుతూ ఇతర విద్యార్థుల తో పోలిస్తే ఎన్‌సీ సీ శిక్షణ పొం దుతున్న వారిలో ఉత్త మమైన లక్షణాలు మంచి నడవడిక, సమాజ శ్రే యస్సుకు పా డుపడాలన్న వ్యక్తిత్వ విలువలు ఉం టాయన్నారు. ఎన్‌సీ సీసీటీవో శంకర్‌ మాట్లాడుతూ కళాశాల, ఎన్‌సీసీ విభాగం గొప్పతనాన్ని చాటిచెప్పేలా క్యాడె ట్లు ముందుకు సాగాలన్నారు. కళాశాల ఎన్‌సీసీ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు, ఇత ర క్యాంపుల్లో కళాశాల ఎన్‌సీసీ క్యాడెట్ల ప్రతిభను చదివి వినిపించారు. కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర బృందం,  సీనియర్‌ ఎన్‌సీసీ క్యాడెట్లు ఆనంద్‌, శ్రీకాంత్‌, భీంషప్ప, మల్లికార్జున్‌, నరేష్‌, లక్ష్మీచౌహన్‌, నందిని, లక్ష్మణ్‌ పాల్గొన్నారు. 


మాట్లాడుతున్న ప్రిన్సిపాల్‌ మెర్సీ వసంత


Advertisement
Advertisement