Abn logo
Jan 27 2021 @ 00:59AM

బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలి

బ్యాంక్‌ లింకేజీ చెక్కు అందిస్తున్న కలెక్టర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌, ఎస్పీ

 -  కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌  

-   ఘనంగా గణతంత్ర వేడుకలు 

సిరిసిల్ల, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): బంగారు తెలంగాణ నిర్మాణంలో యువతరం భాగస్వామ్యం కావాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ పిలుపునిచ్చారు. మంగళవారంజిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఆవి ష్కరించి పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించారు. లబ్ధిదారులకు ఆస్తు లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం భారతీయులందరికీ గొప్ప జాతీయ పండగని, స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకోవాలని అన్నారు. తెలంగాణ  ప్రభుత్వం ప్రజలే కేంద్ర బిందువుగా సుపరిపాలన సాగిస్తోందని,  సం క్షేమ కార్యక్రమాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో బీడుభూములు సస్యశ్యామలం అవుతున్నాయన్నారు. జిల్లాలో ఏడాదిలో 6 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయని, అఖిలభారత సర్వీస్‌ అధికారులకు వాటర్‌ మేనేజ్‌మెంట్‌ అంశంలో పాఠ్యాంశంగా నిల వడం జిల్లా ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు. కాళేశ్వరం ప్యాకేజీ 9 పనుల ద్వారా మిడ్‌మానేరు ప్రాజెక్టు నుంచి ఎగువ మానేరు ప్రాజెక్టు వర కు నీటిని ఎత్తిపోయనున్నట్లు చెప్పారు. వ్యవసాయాన్ని పండుగగా మార్చ డమే  ప్రభుత్వ సంకల్పమని, ఇందులో భాగంగా రైతు బంధు పథకానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. రైతులు తమ పంట ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి జిల్లాలో  49వేల 400 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం ఉన్న 12 ఆధునిక వ్యవసాయ గోదాములను నిర్మించిందన్నారు. సిరిసిల్ల మున్సిపా లిటీ పరిధిలో సర్దాపూర్‌ వద్ద 20ఎకరాల్లో కొత్త మార్కెట్‌ యార్డు నిర్మిస్తోం దన్నారు. 57 క్లస్టర్లలో రైతువేదికలను నిర్మించామని, త్వరలోనే ప్రారం భించనున్నామని తెలిపారు.  మిషన్‌భగీరథ పథకం ద్వారా జిల్లాలోని 13 మండలాల పరిధిలో 359 అవాసాలకు 5.50 లక్షల మంది ప్రజలకు తాగు నీరు అందించడానికి పనులు పూర్తి చేశామన్నారు. నిరుపేదల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని, జిల్లా కేంద్రంలో  300 పడకల ఆస్పత్రిని మంజూరు చేసిందని అన్నారు. జిల్లాలో నాలుగు కేంద్రాల్లో కొవిడ్‌ వాక్సినేషన్‌ ప్రారంభించామన్నారు.  

ప్రభుత్వ ఆర్డర్లతో నేతన్నకు చేయూత: పవర్‌లూం, చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఆర్డర్లతో ప్రభుత్వం నేతన్నకు చేయూతనిస్తోందని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ అన్నారు. మరమగ్గాల కార్మికులకు అసాములకు ఉపాధి కల్పించడానికి రూ.2వేల కోట్ల విలువైన బతుకమ్మ చీరలు, క్రిస్మస్‌, రంజాన్‌ పండగల సందర్భంగా ఆర్డర్లను ఇస్తోందన్నారు.  


దేశానికే తలమానికంగా సిరిసిల్ల 

ప్రగతిలో ఉన్న పనులు పూర్తయితే  సిరిసిల్ల దేశానికే తలమానికంగా నిలుస్తుందని కలెక్టర్‌ అన్నారు. రూ.100 కోట్లతో ప్రభుత్వం సిరిసిల్ల పట్టణంలో మౌలికవసతుల కల్పన అభివృద్ధి పనులను చేపట్టిందన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా  సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో  క్షేత్రస్థాయిలో వివిధ అభివృద్ది పనులను పూర్తి చేశామన్నారు.  వేములవాడ రాజరాజేశ్వ స్వామి దేవాలయం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.400 కోట్లు ప్రకటించిందని, అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, ఎస్పీ రాహుల్‌హెగ్డే, అదనపు కలెక్టర్‌ అంజయ్య, అసిస్టెంట్‌ కలెక్టర్‌ రిజ్వాన్‌షేక్‌బాషా, ఆర్డీవో శ్రీనివాస్‌రావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, రైతుబంధు సమితి కో ఆర్డినేటర్‌ గడ్డం నర్సయ్య పాల్గొన్నారు. 


మహిళలకు బ్యాంక్‌ లింకేజీ రుణాలు 

గణతంత్ర వేడుకల్లో భాగంగా సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 478 స్వశక్తి మహిళా సంఘాలకు రూ.30 కోట్ల బ్యాంక్‌ లింకేజీ రుణాలను కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ అందజేశారు. 


ఆకట్టుకున్న స్టాళ్లు

జిల్లా సంక్షేమ శాఖ, జౌళి శాఖ, మున్సిపల్‌, మత్స్య, గ్రామీణాభివృద్ధి, వైద్య, ఆరోగ్య, అటవీ, పశుసంవర్థక, వ్యవసాయ, మిషన్‌భగీరథ ఎస్సీ కార్పొ రేషన్‌శాఖలు ఏర్పాటు చేసిన ప్రభుత్వ పథకాలతో కూడిన స్టాళ్లు ఆకట్టు కున్నాయి.  కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌,  జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, ఎస్పీ రాహుల్‌హెగ్డే, అదనపు కలెక్టర్‌ అంజయ్య స్టాళ్లను పరిశీలించారు. మిషన్‌భగీరథ స్టాల్‌ వద్ద మిషన్‌భగీరథ నీటిని తాగి ప్రశంసించారు. 


జిల్లా కేంద్రంలో.. 

 జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, ఎస్పీ రాహుల్‌హెగ్డే,  జిల్లా జడ్జి జాన్సన్‌ జాతీయ జెండా ఎగురవేశారు. ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిలు శ్రీదేవి, అదనపు జూని యర్‌ సివిల్‌ జడ్జిమంజుల పాల్గొన్నారు. జడ్పీ కార్యాలయంలో సీఈవో గౌతంరెడ్డి పతాకావిష్కరణ చేయగా జడ్పీ చైర్‌పర్సన్‌న్యాలకొండ అరుణ, జడ్పీటీసీలు పాల్గొన్నారు. ఆర్డీవో శ్రీనివాసరావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ, 17వ పోలీస్‌ బెటాలియన్‌లో అదనపు కమాండెంట్‌ పెద్దబాబు,  డీఎస్పీ చంద్రశేఖర్‌,  సీఐ వెంకటనర్సయ్య,  సీఐ సర్వర్‌, గ్రామీణాభివృద్ధి  జిల్లా అధికారి కౌటిల్యరెడ్డి,  డీపీవో రవీందర్‌, మైనింగ్‌  అధికారి సైదుల్‌, పంచాయతీరాజ్‌ ఈఈ  శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి రణధీర్‌, చేనేత జౌళి శాఖ ఏడీ అశోక్‌రావు, జిల్లా వైద్య అరోగ్యశాఖ అఽధికారి డాక్టర్‌ సుమన్‌మోహన్‌రావవు, జిల్లా అసుపత్రి సూపరింటెండెంట్‌  ముర ళీధర్‌రావు, నీటి పారుదల శాఖ ఈఈ అమరేందర్‌రెడ్డి, మున్సిపల్‌  కమి షనర్‌ సమ్మయ్య,  డీటీ కొండల్‌రావు,  తహసీల్దార్‌ మల్లారెడ్డి, ఐసీడీఎస్‌  సీడీపీవో అలేఖ్య, సినారె స్మారక గ్రంధాలయంలో కార్యదర్శి శంకరయ్య పతాకవిష్కరణ చేశారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య అంభేద్కర్‌ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. సెస్‌ కార్యాలయంలో లక్ష్మారెడ్డి, టౌన్‌క్లబ్‌లో అధ్యక్షుడు చేపూరి శ్రీనివాస్‌, ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు శేఖర్‌  జెండా ఎగురవేశారు. అసిస్టెంట్‌ కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement