దేశానికి మనం ఏమిచ్చామనే భావన ప్రజల్లో తీసుకురావాలి

ABN , First Publish Date - 2022-01-21T04:53:17+05:30 IST

దేశం మనకేమిచ్చిందని కాకుండా దేశానికి మనమేమిచ్చామనే భావన ప్రజల్లో కలిగించాలని యోగివేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మునగల సూర్యకళావతి అన్నారు.

దేశానికి మనం ఏమిచ్చామనే భావన ప్రజల్లో తీసుకురావాలి
మాట్లాడుతున్న సూర్యకళావతి

వైవీయూ ఉప కులపతి ఆచార్య సూర్యకళావతి

కడప (మారుతీనగర్‌), జనవరి 20: దేశం మనకేమిచ్చిందని కాకుండా దేశానికి మనమేమిచ్చామనే భావన ప్రజల్లో కలిగించాలని  యోగివేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మునగల సూర్యకళావతి అన్నారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా కేంద్రప్రభుత్వం స్వాతంత్య్ర అమృత్‌మహోత్సవాల పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టిన విషయం తెలిసిందే. గురువారం స్థానిక ఓం శాంతినగర్‌లోని ప్రజాపిత బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూర్యకళావతితో పాటుగా సీనియర్‌ సివిల్‌ జడ్జి కవిత హాజరై మాట్లాడారు. ప్రజల్లో దేశ భక్తి స్పూర్తినింపేందుకు ప్రధాని నరేంద్రమోదీ సంకల్పించి మౌంట్‌అబులో ప్రారంభించిన కార్యక్రమం హర్షణీయమన్నారు. ఇందులో భారత సర్కార్‌ ప్రజాపిత బ్రహ్మకుమారీస్‌ సంస్థను భాగస్వాములను చేయడం సంతోషంగా ఉందన్నారు. రానున్న పది నెలల పాటు దేశంలోని అన్ని వర్గాల ప్రజలను, ముఖ్యంగా మహిళలు, రైతులు, యువకులు, పిల్లలందరి కోసం విశేష కార్యక్రమాలను నిర్వహించేందుకు కేంద్రప్రభుత్వం సంకల్పించడం అభినంద నీయమన్నారు. కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు శ్రీనాథ్‌రెడ్డి, ప్రజాపిత బ్రహ్మకుమారీస్‌ సంస్థ జిల్లా కో ఆర్డినేటర్‌ గీతా అక్కయ్య, బ్రహ్మకుమారీలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-21T04:53:17+05:30 IST