Abn logo
May 26 2020 @ 00:00AM

పరిశ్రమలను ఆదుకోవాలి

 సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు


ఖమ్మం మయూరిసెంటర్‌, మే 25: సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ అర్థిక ప్యాకేజీపైౖ  చర్చా గోష్ఠిలో మాట్లాడారు.  జిల్లాలో గ్రానైట్‌, వాటర్‌ ప్లాంట్స్‌, ప్రైవేట్‌ విద్యాసంస్థలు, దాల్‌మిల్‌, కోల్డ్‌ స్టోరెజ్‌లు. మొదలైన పరిశ్రమలు నడవాలి అంటే వాటికి ప్రభుత్వ సహాయం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రానైట్‌ అసోషియోషన్‌ నాయకులు రాయల నాగేశ్వరరావు, వజినేపల్లి శ్రీనివాసరావు పుసులూరి నరేందర్‌, తాళ్లూరి మదు, వాసిరెడ్డి రవికుమార్‌, నాగయ్య, వెంకటేశ్వరరావు ఉన్నారు.

Advertisement
Advertisement