అభివృద్ధికి భవిష్యత్‌ ప్రణాళికను రూపొందిస్తాం

ABN , First Publish Date - 2022-01-19T05:18:10+05:30 IST

భూదాన్‌పోచంపల్లికి ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామం అవార్డు రావడంతో భవిష్యత్‌ ప్రణాళికను రూపొందించి పట్టణాభివృద్ధికి కృషి చేస్తామని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ చిట్టిపోలు విజయలక్ష్మీశ్రీనివాస్‌ అన్నారు.

అభివృద్ధికి భవిష్యత్‌ ప్రణాళికను రూపొందిస్తాం
సమావేశంలో మాట్లాడుతున్న చైర్‌పర్సన్‌ విజయలక్ష్మీ

భూదాన్‌పోచంపల్లి, జనవరి 18 : భూదాన్‌పోచంపల్లికి ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామం అవార్డు రావడంతో భవిష్యత్‌ ప్రణాళికను రూపొందించి పట్టణాభివృద్ధికి కృషి చేస్తామని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ చిట్టిపోలు విజయలక్ష్మీశ్రీనివాస్‌ అన్నారు. మండలంలోని జలాల్‌పూర్‌ గ్రామంలో స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో మంగళవారం కల్పన ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘భూదాన్‌పోచంపల్లి పట్టణాభివృద్ధి - భవిష్యత్‌ ప్రణాళిక’ అనే అం శంపై సదస్సులో ఆమె మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పట్టణంలో మౌలిక వసతులను అభివృద్ధి పర్చడమే కాకుండా పర్యాటకులను ఆకట్టుకునేలా పలు అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన జరుగుతోందన్నారు. పట్టణ ప్రము ఖులు, పార్టీల నాయకులు, మేధావులు, నిపుణుల సహకారంతో పట్టణాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామన్నారు. కల్పన ఫౌండేషన్‌ మేనేజింగ్‌ ట్రస్టీ చారులత అధ్యక్షతన జరిగిన సదస్సులో సీనియర్‌ స్ట్రక్చరల్‌ ఇంజనీయర్‌ కాచర్ల రాజ్‌కుమార్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తడక వెంకటేశ్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గునిగంటి రమే్‌షగౌడ్‌, టీఆర్‌ఎస్‌ ప్రతినిధులు చిట్టిపోలు శ్రీనివాస్‌, బాత్క లింగస్వామియాదవ్‌, తడక రమే్‌షతో పాటు మాజీ సర్పంచు నోముల గణేష్‌, నాయకులు తడక యాదగిరి, పట్నం కృష్ణకుమార్‌, సీత దామోదర్‌, చెరుపల్లి హరిశంకర్‌, రావిరాల బాలచందర్‌, గుజ్జ సత్యనారాయణ, చిక్క కృష్ణ, మెరుగు శశికళ, బడుగు చండికేశ్వర్‌, చింతకింది రమేష్‌, ఏలె భిక్షపతి, భారత పురుషోత్తం, కర్నాటి పాండు, కర్నాటి మల్లేశ్వర్‌, భారత వాసుదేవ్‌, బోగ విష్ణు, సీత వెంకటేశం, మల్లే్‌షగౌడ్‌, కృష్ణమూర్తి పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-19T05:18:10+05:30 IST