ఇతర మతాల పవిత్ర స్థలాలను కాపాడతాం: పాకిస్తాన్ స్పీకర్

ABN , First Publish Date - 2022-01-05T02:32:41+05:30 IST

ఇతర మతాల పవిత్ర స్థలాలను కాపాడతాం: పాకిస్తాన్ స్పీకర్

ఇతర మతాల పవిత్ర స్థలాలను కాపాడతాం: పాకిస్తాన్ స్పీకర్

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి హిందూ మతంతో పాటు ఇతర మైనారిటీ మతాల పవిత్ర స్థలాలను సురక్షితంగా కాపాడతామని, రక్షణ కల్పిస్తామని పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అసద్ ఖైసర్ అన్నారు. దేశ అభివృద్ధిలో ముస్లిమేతరులైన మైనారిటీలు సేవలు విశేషమైనవని ఆయన గుర్తు చేసుకున్నారు. సోమవారం ప్రపంచ పర్యటనలో ఉన్న ఒక హిందూ సమూహం పాకిస్తాన్ పార్లమెంట్‌ను సందర్శించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఖైసర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


‘‘మైనారిటీలకే కాదు, వారి విశ్వాసాలకు, వారి పవిత్ర స్థలాలకు రక్షణ కల్పించడం ప్రాథమిక హక్కుల్లో భాగం. ఆ హక్కును మేము కాపాడతాం. పాకిస్తాన్‌కు వచ్చే హిందూ యాత్రికులకు సాదర ఆహ్వానం. మైనారిటీలకు పాకిస్తాన్ శాంతికి నాంది పలికింది, మైనారిటీలపై గౌరవంతో ఉంటుంది. పాకిస్తాన్ అభివృద్ధిలో మైనారిటీల పాత్ర విశేషమైంది. ప్రభుత్వం మైనారిటీల పవిత్ర ప్రదేశాలకు రక్షణ కల్పించాలని, వాటిని కాపాడాలని నిర్ణయించింది. అలాగే విదేశీ యాత్రికులకు సౌకర్యవంతమైన ఆహ్వానం పలికి వారి గౌరవాన్ని పొందాలనుకుంటోంది’’ అని ఖైసర్ అన్నారు.

Updated Date - 2022-01-05T02:32:41+05:30 IST