మన రక్షణకు మనమే కవచం

ABN , First Publish Date - 2021-06-16T06:21:50+05:30 IST

శవాల గుట్టలు చూసి రాబందుల రెక్కల చప్పుడు శ్మశానంలో చోటు కొరకు శవాల నిరీక్షణ...

మన రక్షణకు మనమే కవచం

శవాల గుట్టలు చూసి రాబందుల రెక్కల చప్పుడు

శ్మశానంలో చోటు కొరకు శవాల నిరీక్షణ

విశ్వయవనికపై కరోనా విలయతాండవం

చరిత్రను కలుషితం చేసే శవాల సంతకం


ఊపిరున్నప్పుడు బారులుతీరి...

ఊపిరి పోయాక కూడా బారులుతీరి...

గాలికి కొట్టుమిట్టాడుతున్న ప్రాణదీపాలు

ఎప్పుడారిపోతాయో ఎవరికీ తెలియని రహస్యం

ఈరోజు ఉన్న మనిషి ఉనికి రేపటికి ప్రశ్నార్థకం

ప్రాణాలు పోసే వైద్యుల ప్రాణాలూ మహమ్మారికి అర్పణం


దైవానికి మొరపెట్టుకుందామని

దేవాలయానికి వెళ్తే ద్వారాలు మూసేశారు

భగవంతుడు తన గుండెను బండ చేసుకొని

విలయవిన్యాసాన్ని వీక్షిస్తున్నాడు


భయం భయం భయం ఎన్నాళ్ళీ భయం 

భయం ఒక పిరికితనం


జనం మనం మనం జనం విజ్ఞులమై సాగుదాం

ప్రాణభయం వీడి మనం కరోనాను జయిద్దాం

మానవ మేధాశక్తిని కరోనాకు చూపిద్దాం

మాస్కులను ధరించి మరణాన్ని జయిద్దాం

l సత్రం మల్లేశ్వరరావు

Updated Date - 2021-06-16T06:21:50+05:30 IST