పట్టణ ప్రగతిలో భాగస్వాములు కావాలి

ABN , First Publish Date - 2020-02-23T07:02:55+05:30 IST

ఈనెల 24 నుంచి నగర కార్పొరేషన్‌లో చేపట్టబోయే పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావా లని నగర మేయర్‌ దండు నీతు కిరణ్‌ కోరారు. శని

పట్టణ ప్రగతిలో భాగస్వాములు కావాలి

నగర మేయర్‌ దండు నీతు కిరణ్‌ 


జామాబాద్‌ అర్బన్‌, ఫిబ్రవరి 22: ఈనెల 24 నుంచి నగర కార్పొరేషన్‌లో చేపట్టబోయే పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావా లని నగర మేయర్‌ దండు నీతు కిరణ్‌ కోరారు. శని వారం నగరంలోని న్యూఅంబేద్కర్‌ భవన్‌లో నగర పాలక సంస్థ పట్టణ ప్రగతి కార్యక్రమంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నగర మేయర్‌ దండు నీతు కిరణ్‌  మాట్లాడుతూ ఈనెల 24 నుంచి మార్చి 4 వర కు  పదిరోజుల పాటు ప్రతి డివిజన్‌లో నిర్వహించే ప ట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ఆ డివిజన్‌లో ముఖ్య సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. డివిజన్‌లలో మురికి కాలువల నిర్వహణ, చెత్త తొలగింపు, రోడ్లకు ఇరువైపుల పెరిగిన పొదల తొలగింపు, ఖాళీ స్థలాల్లో ఉన్న నీటిని తొలగించడం, పార్కు ప్రాంతాలను శుభ్రం చేయడం, ప్రజలకు అసౌకర్యంగా ఉన్న కరెంటు స్తం భాలను, వైర్లను తొలగించి మరమ్మతులు చేయడం లాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని  ప్రజ లతో పాటు ప్రజాప్రతినిధులు ఇందులో భాగస్వా ములు కావాలన్నారు.


నగర కమిషనర్‌ జితేష్‌ వి పాటి ల్‌ మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా పట్టణాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, ప్రతి ఒక్కరూ పా ల్గొని విజయవంతం చేయాలన్నారు. డివిజన్‌ స్థాయి స మస్యలు డివిజన్‌లోనే పరిష్కారం అయ్యే విధంగా ఈ కార్యక్రమం తోడ్పడుతుందన్నారు. కావున ప్రతి ఒక్క రూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల న్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ స్థాయి అధికారులు, కార్పొరేటర్‌లు, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-02-23T07:02:55+05:30 IST