చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం

ABN , First Publish Date - 2021-10-23T05:21:16+05:30 IST

వానాకాలంలో రైతులు సాగుచేసిన వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తా మని కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ స్పష్టం చేశారు.

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ

- ఈనెల 27 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం 

- కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ

పెద్దపల్లి, అక్టోబర్‌ 22 (ఆంధ్రజ్యోతి): వానాకాలంలో రైతులు సాగుచేసిన వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తా మని కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో నిర్వహిం చిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ సీజన్‌లో జిల్లా లో 2,11,090 ఎకరాల్లో వరిసాగు చేశారని, తద్వారా 5,11,226 మెట్రి క్‌ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అంచనా వేశామన్నారు. ఇందులో 4లక్షల 60 వేల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 292 గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామ న్నారు. రెండు రోజుల్లో ఎక్కడెక్కడ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నా రనే విషయమై తుది జాబితాను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు కేంద్రాల నిర్వాహ కులకు శిక్షణ ఇవ్వాలన్నారు. ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన టార్ఫాలిన్లు, ఎలకా్ట్రనిక్‌ తూకం యంత్రాలు, ధాన్యం శుద్ధి చేసే యం త్రాలు, తేమ శాతం కొలిచే యంత్రాలు, గన్నీ బ్యాగులను అందుబా టులో ఉంచుకోవాలన్నారు. జిల్లాలో ఉన్న ప్యాడీ క్లీనర్లను మేజర్‌ సెంటర్లకు కేటాయించాలన్నారు. రైతులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యాన్ని కేంద్రాలకు తీసుక వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోళ్లకు కోటి 15 లక్షల 2 వేల గన్నీ సంచులు అవసరం ఉండగా, ప్రస్తుతం 63 లక్షల 43 వేల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు. మిగిలిన సంచులను తెప్పించుకోవాలన్నారు. ధాన్యం రవాణా చేయ డంలో సమస్యలు ఎదురు కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో రైస్‌ మిల్లులను కొనుగోలు కేంద్రాలకు మ్యాపింగ్‌ చేయాల న్నారు. కేంద్రాల్లో కనీస వసతులను కల్పించాలన్నారు. ఏ గ్రేడ్‌ ధాన్యాన్ని 1960, కామన్‌ గ్రేడ్‌ ధాన్యాన్ని 1940 రూపాయలకు కొను గోలు చేయాలన్నారు. ఈనెల 27వ తేదీ నుంచి కొనుగోలు కేంద్రా లను ప్రారంభించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ, పౌర సరఫరాల సంస్థ మేనేజర్‌ ప్రవీణ్‌ కుమార్‌, డీఆర్‌డీవో శ్రీధర్‌, డీఎం వో ప్రవీణ్‌రెడ్డి, డీఏవో తిరుమలప్రసాద్‌, డీఎస్‌వో తోట వెంకటేశ్‌, జిల్లా తూనికలు, కొలతల అధికారి విశ్వేశ్వర్‌, డీసీఎంఎస్‌ మేనేజర్‌ వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-23T05:21:16+05:30 IST