పీఆర్‌ఎల్‌ఐని పూర్తి చేసి సాగునీరందిస్తాం: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-04-14T05:00:29+05:30 IST

పీఆర్‌ఎల్‌ఐని పూర్తి చేసి కల్వకుర్తి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ఎమ్మెల్యే గుర్క జైపాల్‌ యాదవ్‌ అన్నారు.

పీఆర్‌ఎల్‌ఐని పూర్తి చేసి సాగునీరందిస్తాం: ఎమ్మెల్యే
క్రికెట్‌ టోర్నమెంట్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గుర్క జైపాల్‌ యాదవ్‌

కల్వకుర్తి అర్బన్‌, ఏప్రిల్‌ 13: పీఆర్‌ఎల్‌ఐని పూర్తి చేసి కల్వకుర్తి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ఎమ్మెల్యే గుర్క జైపాల్‌ యాదవ్‌ అన్నారు. పాడిపం టలతో ఈ ప్రాంతం తులతూగాలన్నారు. మండల పరిధిలోని మార్చాల గ్రామంలో మాజీ ఎంపీపీ మాధవయ్య జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే గుర్క జైపాల్‌ యాదవ్‌ ప్రా రంభించారు. సీనియర్‌ టీఆర్‌ఎస్‌ నాయకుడు బచ్చిరె డ్డి అనారోగ్యానికి గురికాడవంతో ఇంటికి వెళ్లి ఆయన ను పరామర్శించారు. అంతకుముందు మాధవయ్య, అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. కిషోర్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేఎల్‌ఐ ద్వారా సాగు నీరందని ప్రాంతానికి లక్ష 25వేల ఎకరాలకు పీఆర్‌ఎల్‌ఐ ద్వారా సాగు నీరు అందించడం జరుగుతోందన్నారు. నార్లాపూర్‌, వట్టెం, ఎదుల రిజర్వాయర్‌ల ద్వారా సాగు నీరందించడం జరుగుతోందన్నారు. 


ట్రామా కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయిస్తా

కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేపి ట్రామా కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలి పారు. కల్వకుర్తి కేంద్రంగా మూడు జాతీయ రహ దారులు ఉండటం మూలంగా ట్రామా కేర్‌ సెంటర్‌ అవసరమని పేర్కొన్నారు. 


వారి ఆశయాలను కొనసాగిస్తాం 

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ మాధవయ్యల ఆశయాలను కొనసాగిస్తామ ని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ చైర్మన్‌ బాల య్య, వైస్‌ చైర్మన్‌ విజయ్‌గౌడ్‌, ఎంపీపీ సునీత, మునిసిపల్‌ చైర్మన్‌ సత్యం, సర్పంచ్‌ ఆవ మల్లయ్య, ఎంపీటీసీ సంతోష, కౌన్సిలర్‌ సూర్య ప్రకాష్‌ రావు, మనోహర్‌రెడ్డి, పుల్లారెడ్డి, కృష్ణయ్య, కురుమయ్య, మల్లేష్‌, మాధవన్‌, వెంకటయ్య, గణేష్‌, శ్రీకాంత్‌, నిర్వాహకులు కిషోర్‌, కిరణ్‌, బాలరాజ్‌, రామాంజ నేయులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-14T05:00:29+05:30 IST