Abn logo
Sep 19 2021 @ 23:02PM

అన్ని గ్రామాల్లో దీక్షలు కొనసాగిస్తాం

యావాపూర్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తలు చేపట్టిన దీక్షలో మాట్లాడుతున్న నర్పారెడ్డి

గజ్వేల్‌ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి

తూప్రాన్‌రూరల్‌, సెప్టెంబరు 19 : గజ్వేల్‌ పట్టణంలో చేపట్టిన దళిత, గిరిజన దండోరా సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో మంచి ఊపు వచ్చిందని, యావాపూర్‌లో జరిగిన కాంగ్రెస్‌ కార్యకర్తల దీక్ష స్ఫూర్తితో గజ్వేల్‌ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ పాలనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను మొదలుపెడతామని మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి తెలిపారు. ఆదివారం తూప్రాన్‌ మండలం యావాపూర్‌లో కేసీఆర్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరనందుకు నిరసనగా మాజీ ఎంపీటీసీ యాంజాలస్వామి ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో యువ నాయకురాలు అనూషరెడ్డి, మండల అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, రవీందర్‌గుప్తా, నాగరాజుగౌడ్‌ పాల్గొన్నారు.