Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించే వరకు ఉద్యమిస్తాం

బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్‌ 

జగిత్యాల అర్బన్‌, డిసెంబరు 3: రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ పై వ్యాట్‌ను తగ్గించేవరకు ఉద్యమం కొనసాగిస్తామని బీజేపీ దళిత మోర్చ రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక తహసీల్‌ చౌరస్తా వద్ద జిల్లా అధ్యక్షుడు అలగుర్తి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో, కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఓ కార్యకర్త గుర్రంపై వచ్చి నిరసనలో పాల్గొన్నాడు. వ్యాట్‌ తగ్గించని ప క్షంలో బీజేపీ దళిత మోర్చ ఆధ్వర్యంలో ఉద్యమాలకు సిద్దం అవుతామని చంద్రశేఖర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత మోర్చ పట్టణ అధ్యక్షుడు నక్క జీవన్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement