Abn logo
Sep 24 2021 @ 00:30AM

అర్హులందరి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాం

మాట్లాడుతున్న కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

- దళితబంధుపై సమీక్షలో కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

కరీంనగర్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): హుజూరాబాద్‌ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరి ఖాతాల్లో దళితబంధు డబ్బులను జమ చేస్తామని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ తెలిపారు. గురువారం దళితబంధు పథకం అమలు తీరుపై కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో క్లస్టర్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇప్పటి వరకు డబ్బులు జమ కానీ అర్హులైన కుటుంబాల లబ్ధిదారులకు వెంటనే ఖాతాలు తెరిపించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. అర్హులైన లబ్దిదారులకు అందరికీ మరో రెండు రోజుల్లో దళితబంధు పథకం డబ్బులు జమ చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌, గరిమ అగర్వాల్‌, జడ్పీ సీఈవో ప్రియాంక, ఎల్‌డీఎం లక్ష్మణ్‌, క్లస్టర్‌ అధికారులు పాల్గొన్నారు.