అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటాం

ABN , First Publish Date - 2021-10-25T05:10:19+05:30 IST

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు వెంట నే పరిష్కరించక పోతే త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని భవన నిర్మాణ కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి వెంకట సుబ్బయ్య, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నా గ సుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటాం
సమావేశంలో మాట్లాడుతున్న నేతలు

శిక్షణ తరగతుల్లో ఏఐటీయూసీ

మైదుకూరు, అక్టోబరు 24: భవన నిర్మాణ కార్మికుల సమస్యలు వెంట నే పరిష్కరించక పోతే త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని భవన నిర్మాణ కార్మికుల సంఘం రాష్ట్ర  ప్రధాన కా ర్యదర్శి వెంకట సుబ్బయ్య, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నా గ సుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లాలోని భవన నిర్మాణ కార్మికులకు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఒక రోజు శిక్షణలో వారు మాట్లాడుతూ

భవన నిర్మాణ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న క్లయిమ్స్‌ మంజూరు చేయకుండా నిర్లక్ష్యం చేస్తోం దన్నారు. కార్మిక కుటుంబాలను సంక్షేమ బోర్డు ద్వారా ఆదుకోవాలని, లేబర్‌ ఆఫీసులో ఖాళీలను భర్తీ చేయాలని, కార్మికుల పిల్లలకు వేతనాలు ఇవ్వాలని, 55 ఏళ్లు నిండిన వారికి పెన్షన్‌ ఇవ్వాలని లేక పోతే వచ్చే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామన్నారు. బాదుల్లా, శ్రీరాములు, ఏవీ శివరాం, మద్దిలేటి, చంద్ర తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-25T05:10:19+05:30 IST