Advertisement
Advertisement
Abn logo
Advertisement

అక్బరుద్దీన్‌కు న్యాయం చేస్తాం: కడప మేయర్

కడప: భూ వివాదానికి సంబంధించి అక్బరుద్దీన్‌కు న్యాయం చేస్తామని కడప మేయర్ సురేష్ బాబు అన్నారు.  భూ ఆక్రమణలపై కఠినంగా వ్యవహరించాలని సీఎం జగన్ ఆదేశించారని మేయర్ సురేష్ బాబు తెలిపారు. జిల్లాలో సంచలనం సృష్టించిన భూ వివాదంలో బాధితుడు అక్బరుద్దీన్‌ను వెంటబెట్టుకుని ఎస్పీని మేయర్ సురేష్ బాబు, మైనార్టీ నాయకులు కలిసారు. అక్బరుద్దీన్‌కు త్వరలో న్యాయం చేస్తామన్నారు. అక్బరుద్దీన్‌కు అన్యాయం చేయాలని చూసిన వారిని వదిలిపెట్టేది లేదన్నారు. అధికారులపైనా చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరామన్నారు. ఇలాంటి భూఅక్రమణలపై కఠినంగా వ్యవహరించాలని సీఎం జగన్ అదేశించారని ఆయన పేర్కొన్నారు. వైసీపీ ఇలాంటి వాటిని ప్రోత్సహించదన్నారు. తమకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేస్తున్నారని, ఈ సంఘటన దురదృష్టకరమని మేయర్ సురేష్ బాబు పేర్కొన్నారు. 


Advertisement
Advertisement