కండ్ర కులస్థులకు న్యాయం చేస్తాం

ABN , First Publish Date - 2021-10-27T05:00:38+05:30 IST

కండ్ర కులస్థుల సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించి.. వారికి న్యాయం చేస్తామని రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఎ.శంకర్‌ నారాయణ తెలిపారు. చేపల వేటతో జీవనం సాగించే తమను బీసీ-డీ నుంచి బీసీ-ఏ లోకి మార్చాలంటూ కండ్ర కులస్థులు చేసిన విజ్ఞప్తి మేరకు రాష్ట్ర బీసీ కమిషన్‌ మంగళవారం కళింగపట్నం పంచాయతీ కండ్రపేటలో పర్యటించింది. కండ్ర కులస్థుల ఇళ్లు, వారి జీవన విధానం, వలలు, పనిముట్లను కమిషన్‌ సభ్యులు పరిశీలించారు.

కండ్ర కులస్థులకు న్యాయం చేస్తాం
కండ్రపేటలో పర్యటిస్తున్న కమిషన్‌ సభ్యులు

- బీసీ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ శంకర్‌నారాయణ 

కళింగపట్నం (గార), అక్టోబరు 26: కండ్ర కులస్థుల సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించి.. వారికి న్యాయం చేస్తామని రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఎ.శంకర్‌ నారాయణ తెలిపారు. చేపల వేటతో జీవనం సాగించే తమను బీసీ-డీ నుంచి బీసీ-ఏ లోకి మార్చాలంటూ కండ్ర కులస్థులు చేసిన విజ్ఞప్తి మేరకు రాష్ట్ర బీసీ కమిషన్‌ మంగళవారం కళింగపట్నం పంచాయతీ కండ్రపేటలో పర్యటించింది. కండ్ర కులస్థుల ఇళ్లు, వారి జీవన విధానం, వలలు, పనిముట్లను కమిషన్‌ సభ్యులు పరిశీలించారు. దశాబ్దాలుగా తాము చాలా పేదరికంలో మగ్గుతున్నామని.. చేపలవేట తప్ప మరేవిధమైన జీవనాధారం లేక కొన్నిసార్లు పస్తులు ఉండవలసి వస్తోందని పలువురు కండ్ర కుల పెద్దలు, మహిళలు కమిషన్‌ ఎదుట వాపోయారు. పేదరికం కారణంగా తమ పిల్లలను పాఠశాలల్లో కూడా చేర్పించలేకపోతున్నామని తెలిపారు. తమ కులస్థులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి చేర్చి న్యాయం చేయాలని కమిషన్‌ చైర్మన్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కమిషన్‌ సభ్యులు సి.దివాకర్‌, ఎం.కిష్టప్ప, ఎ.ముసలయ్య,  కార్యదర్శి చంద్రశేఖరరాజు, ఎంపీపీ గొండు రఘురాం, జిల్లా బీసీ సంక్షేమాధికారి గుత్తు రాజారావు, ఎంపీడీవో రామ్మోహనరావు, డిప్యూటీ తహసీల్దార్‌ ప్రసాదరావు, కళింగపట్నం సర్పంచ్‌ తమ్మిన మౌనికారాణి, కొర్ని సర్పంచ్‌ పీస గోపి, ఏపీవో సీహెచ్‌ సంధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఎ.శంకర్‌నారాయణతో పాటు సభ్యులు అరసవల్లి సూర్యనారాయణస్వామిని, శ్రీకూర్మనాథుడిని దర్శించుకుని పూజలు చేశారు.


నియామకాల్లో రిజర్వేషన్‌ పాటించాల్సిందే

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, అక్టోబరు 26 : నియామకాల్లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించాలని బీసీ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ శంకర్‌నారాయణ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్‌ శ్రీకేష్‌ లఠ్కర్‌తో కలసి కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ శంకర్‌నారాయణ మాట్లాడుతూ..  నియామకాల్లో రూల్‌ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించడం వల్ల వెనుకబడిన తరగతుల కులాల్లోని అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. కుల  ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేటప్పుడు ముందుగా క్షేత్రస్థాయిలో విచారణ చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు అన్ని కులాలకు అందేలా కూడాలన్నారు.  ఈ సమావేశంలో బీసీ కమిషన్‌ కార్యదర్శి చంద్రశేఖర్‌రాజు, సభ్యులు ముసలయ్య, మరక్క గిరి కృష్ణప్ప, గౌత్రీ వెంకట సత్యదివాకర్‌, డీఆర్వో దయానిధి, తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-27T05:00:38+05:30 IST