Advertisement
Advertisement
Abn logo
Advertisement

బహుళ పరిజ్ఞానంతోనే రాణిస్తాం

కోదాడ, డిసెంబరు 3: పోటీప్రపంచంలో రాణించాలంటే విద్యార్థినులు బహుళ పరిజ్ఞానం అలవర్చుకోవాలని కిట్స్‌ మహిళా ఇంజనీరింగ్‌ కళాశాల చైర్మన్‌ నీలా సత్యనారాయణ అన్నారు. కళాశాలలో క్యాంపస్‌ సెలక్షన్‌లో రాణించిన విద్యార్థినులను శుక్రవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడితే ఫలితం ఉంటుందన్నారు. విద్యార్థినులు ఎప్పటికప్పడు సాంకేతికత మార్పులను గమనించాలన్నారు. అప్పుడే భవిష్యత్‌ ఉన్నతంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ నాగార్జున, అధ్యాపకులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement