సంఘ్‌పై కలిసి కట్టుగా పోరాడతాం

ABN , First Publish Date - 2021-04-04T06:39:28+05:30 IST

రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేసేదాకా సంఘ్‌పై కలిసికట్టుగా పోరాడతామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు.

సంఘ్‌పై కలిసి కట్టుగా పోరాడతాం

  • రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి 
  • నేను ప్రధాని అయితే ఉద్యోగాల కల్పనపై దృష్టి: రాహుల్‌


న్యూఢిల్లీ/కొయిలండీ, ఏప్రిల్‌ 3: రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేసేదాకా సంఘ్‌పై కలిసికట్టుగా పోరాడతామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్‌ తికాయిత్‌ కాన్వాయ్‌పై రాజస్థాన్‌లోని అల్వార్‌ జిల్లాలో రాళ్ల దాడి జరిగిన నేపథ్యంలో ఆయన ఇలా స్పందించారు. ఈ కేసులో ఏబీవీపీకి చెందిన ఓ విద్యార్థి నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారని, దీని వెనక బీజేపీ హస్తం ఉందని ఆయన ఆరోపించారు.


అమెరికా మాజీ విదేశాంగ మంత్రి నికోలస్‌ బర్న్స్‌తో ఆన్‌లైన్‌లో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీరు ప్రధాని అయితే ఎటువంటి విధానాలకు ప్రాధాన్యమిస్తారని నికోలస్‌ అడిగిన ప్రశ్నకు రాహుల్‌ సమాధానమిచ్చారు. ‘‘నేను అభివృద్ధి కంటే ఉపాధి కల్పించే దిశగా ఆలోచిస్తాను. మనకు అభివృద్ధి అవసరం. అదే సమయంలో ఉత్పత్తి, ఉపాధిని పెంచడానికి మేము అనేక కార్యక్రమాలను చేయబోతున్నాం. 9 శాతం ఆర్థిక వృద్ధి జరిగిందన్న అంశాన్ని నేను పట్టించుకోను’’ అని వ్యాఖ్యానించారు.



సీపీఐ(ఎం) ముక్త్‌ భారత్‌ అనరెందుకు..

‘‘ప్రధాని ఎప్పుడూ కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ అని అంటుంటారు. సీపీఐ(ఎం) ముక్త్‌ భారత్‌ అని ఆయన ఎప్పుడూ నినదించరు. బహుశా ఆయనకు కాంగ్రె్‌సతోనే సమస్యలు అనుకుంటా. కాంగ్రెస్‌ అందరినీ ఏకతాటిపైకి తెచ్చే శక్తి. ఇలా ఏకంచేసేవారిని ఆర్‌ఎ్‌సఎస్‌ ప్రమాదకారులుగా భావిస్తుంది. వారికి బాగా తెలుసు వారిలాగే లెఫ్ట్‌ ఫ్రంట్‌ కూడా విడదీసే శక్తి అని’’ అని రాహుల్‌ అన్నారు. ఏప్రిల్‌ 6న కేరళలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


Updated Date - 2021-04-04T06:39:28+05:30 IST