Abn logo
Sep 21 2021 @ 23:23PM

మార్లవాయిని మోడల్‌ విలేజ్‌గా చేస్తాం

డార్ఫ్‌ విగ్రహాల వద్ద ఎంపీ, ఎమ్మెల్యే, జడ్పీ చైర్‌పర్సన్‌, కలెక్టర్‌

- ఎంపీ సోయం బాపూరావు

జైనూరు, సెప్టెంబరు 21: మార్లవాయి గ్రామాన్ని జిల్లాలోనే మోడల్‌ విలేజ్‌గా తీర్చిదిద్దుతామని ఎంపీ సోయం బాపూ రావు అన్నారు. దేశంలోని మంత్రులు, కోటగోండ్‌ల విగ్రహాలు ఏర్పాటు చేయ డానికి జడ్పీచైర్‌పర్సన్‌ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రంసక్కు, కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌లతో కలిసి ఆయన భూమిపూజ చేశారు. హైమన్‌ డార్ఫ్‌ దంపతుల విగ్రహాల వద్ద పూజలు చేసి డార్ఫ్‌ భవననిర్మాణంతో పాటు అంబేద్కర్‌, కుమరంభీం, రాంజీ గోండ్‌ విగ్రహాల ఏర్పాటుకు కూడా భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లా డుతూ మార్లవాయి గ్రామం సంసద్‌ ఆదర్శ గ్రామంగా ఎంపిక కావడంపై హర్షం వ్యక్తంచేశారు. విద్య, వ్యవ సాయం, ఆరోగ్య, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, ఐసీడీ ఎస్‌, రెవెన్యూ, విద్యుత్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ లాంటి 14శాఖలకు చెందినపనులను వెంటనే చేపడ తామ న్నారు. గ్రామంలో గుస్సాడీ కోచింగ్‌ సెంటర్‌, ఆదివాసీ రిసోర్స్‌సెంటర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. 

కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ మాట్లాడుతూ హైమన్‌డార్ఫ్‌ వర్ధంతి, గ్రామాభివృద్ధితోపాటు పద్మశ్రీఅవార్డు గ్రహీత కనక రాజుకు లక్ష రూపాయల బహుమానం జిల్లా తరపున అందిస్తామన్నారు. సంవత్సరంలోగా మార్ల వాయి గ్రామానికి రూ.12లక్షల నిధులు కేటాయి స్తామన్నారు. కార్యక్రమంలో అదనపుకలెక్టర్‌ వరుణ్‌ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్‌ యాదవ్‌రావు, కోఆప్షన్‌ సభ్యుడు సయ్యద్‌ అబుతాలీబ్‌, ఎంపీపీ తిరుమల, పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు, సర్పంచ్‌లు వెంకటేష్‌, లక్ష్మణ్‌, భీం రావు, ఎంపీడీవో ప్రభుదయ, తహసీల్దార్‌ సాయన్న, సార్‌మేడి దేవ్‌రావు అంబాజీ పాల్గొన్నారు.