రైతుబజార్‌ను అన్ని వసతులతో తీర్చిదిద్దుతాం

ABN , First Publish Date - 2022-01-23T06:10:26+05:30 IST

జిల్లా కేంద్రంలోని మోడల్‌ రైతు బజార్‌ను అన్ని వసతులు కల్పించి, 15రోజుల్లోగా పునఃప్రారంభిస్తామని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు.

రైతుబజార్‌ను అన్ని వసతులతో తీర్చిదిద్దుతాం
రైతు బజారును పరిశీలిస్తున్న ఎమ్మెల్యే పైళ్ల

భువనగిరి రూరల్‌, జనవరి 22: జిల్లా కేంద్రంలోని మోడల్‌ రైతు బజార్‌ను అన్ని వసతులు కల్పించి, 15రోజుల్లోగా పునఃప్రారంభిస్తామని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని రైతు బజార్‌లో కొనసాగుతున్న నిర్మాణ పనులను శనివారం ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.2కోట్లు వెచ్చించి 92 స్టాల్స్‌ను నిర్మించడంతో పాటు వ్యాపారులకు, రైతులకు, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌలిక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులు నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరితగతిన మోడల్‌ రైతు బజారును వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఆయన వెంట ఏఎంసీ, పీఏసీఎస్‌, మునిసిపల్‌ చైర్మన్లు నల్లమాస రమేశ గౌడ్‌, డాక్టర్‌ పరమేశ్వర్‌రెడ్డి, ఎనబోయిన ఆంజనేయులు, గోమారి సుధాకర్‌ రెడ్డి, మార్కెటింగ్‌ డీఈ సామిల్‌, స్థానిక కౌన్సిలర్‌ అజీమ్‌, మండల, పట్టణ పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు, ఏవీ కిరణ్‌, మల్లయ్య, ఎడ్ల రాజేందర్‌రెడ్డి  ఉన్నారు. 

పేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్‌: ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి

సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు వరమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. మండలంలోని గంగసానిపల్లికి చెందిన రెడ్డబోయిన వెంకటస్వామికి మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం మంజూరైన రూ.రెండు లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును ఆయన లబ్ధిదారుడికి అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు కార్పొరేట్‌ వైద్య సేవలు అందించేందుకు సీఎంఆర్‌ఎఫ్‌ ఎంతగానో దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు నల్లమాస రమేశ, జనగాం పాండు, కంచి మల్లయ్య, నీల ఓం ప్రకాశ, సర్పంచలు రాంపల్లి నగేశ, చిందం మల్లికార్జున, బొమ్మారపు సురేశ, ర్యాకల శ్రీనివాస్‌, జెక్క రాఘవేందర్‌రెడ్డి, పాపయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-23T06:10:26+05:30 IST