Advertisement
Advertisement
Abn logo
Advertisement

కార్మికులను తొలగిస్తే ఉద్యమిస్తాం

సీఐటీయూ రాష్ట్ర నాయకుడు కిల్లెగోపాల్‌

పాలమూరు, నవంబరు 30 : కాటన్‌మిల్‌ కార్మికులను తొలగిస్తే ఉద్యమిస్తామని సీఐటీయూ రాష్ట్ర నాయకుడు కిల్లెగోపాల్‌ అన్నారు. మంగళవారం పట్ట ణంలోని కాటన్‌మిల్‌ వద్ద కార్మికులతో యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎన్‌.కురు మూర్తి, బి.చంద్రకాంత్‌లతో కలిసి ఆయన సమావేశమయ్యారు. రాజ్‌వీర్‌ ఇండ స్ర్టీస్‌ మేనేజ్‌మెంట్‌ చేసిన అప్పులకు బ్యాంకు అధికారులు హస్తగతం చేసుకుని మధ్యవర్తిత్వం ద్వారా ఆరునెలల నుంచి మిల్లును నడిపిస్తున్నారని తెలిపారు. కార్మికులకు ఇవ్వాల్సిన వేతనాలు ఇవ్వకుండా రెగ్యులర్‌గా పనికల్పించకుండా 300మంది పనిచేస్తున్న కార్మికులను వందమందికి తగ్గించాలని కుట్ర చేయడం సహించమన్నారు. ఆ వందమందిని మీరు తేల్చుకోవాలని చెప్పటంతో కార్మికులు ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. సోమవారం నుంచి కాటన్‌ మిల్లు కార్మికులు విధులను బహిష్కరించి ఫ్యాక్టరీ గేటు ఎదుట ఆందోళన నిర్వహించారు. కార్మికులు చేస్తున్న సమ్మెకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాటన్‌మిల్‌ కార్మిక నాయకులు గుర్రాల బాలనాగయ్య, వి.తిరుపతి, టి.కృష్ణయ్య, జగన్‌మోహన్‌రెడ్డి, వేణు గోపాల్‌, రవి, శ్రీరామప్ప, మోహనాచారి, ఈశ్వరమ్మ, మల్లికా, నర్మద, పద్మ, కుమ్మరి శ్రీను, నాగరాజు, కార్మికులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement