ఆక్సిజన్‌ కొరతను అధిగమిస్తాం

ABN , First Publish Date - 2021-05-18T05:13:13+05:30 IST

జిల్లాలో ప్రాణవాయువు కొరతను అధిగమిస్తామని విజయనగరం పార్లమెంట్‌ సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్‌ అన్నారు. జిల్లా కేంద్రాసుపత్రిలో 10 కెఎల్‌ ఆక్సిజన్‌ ట్యాంకరును సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ ట్యాంకులోని ఆక్సిజన్‌ను పైపులైను ద్వారా ఆసుపత్రులోని అన్ని వార్డులకు సరఫరా చేస్తామని తెలిపారు.

ఆక్సిజన్‌ కొరతను అధిగమిస్తాం
ఆక్సిజన్‌ ట్యాంక్‌ను ప్రారంభిస్తున్న ఎంపీ బెల్లాన

ఎంపీ బెల్లాన 

విజయనగరం రింగురోడ్డు, మే 17: జిల్లాలో ప్రాణవాయువు కొరతను అధిగమిస్తామని విజయనగరం పార్లమెంట్‌ సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్‌ అన్నారు. జిల్లా కేంద్రాసుపత్రిలో 10 కెఎల్‌ ఆక్సిజన్‌ ట్యాంకరును సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ ట్యాంకులోని ఆక్సిజన్‌ను పైపులైను ద్వారా ఆసుపత్రులోని అన్ని వార్డులకు సరఫరా చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకూ జిల్లా కేంద్రాసుపత్రిలో 2 కేఎల్‌ ట్యాంకు ఉందని, ప్రస్తుతం 10 కేఎల్‌ ట్యాంకు ద్వారా సరిపడినంత ప్రాణవాయువు అందుబాటులోకి వచ్చిందన్నారు. కరోనా వైరస్‌తో చికిత్స పొందుతున్న వారు ఎటువంటి ఆందోళనకు గురికావద్దని చెప్పారు. కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ మాట్లాడుతూ, కొత్తగా ప్రారంభించిన ఆక్సిజన్‌ ట్యాంకు ద్వారా మరిన్ని పడకలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా శ్రీసిటీ నుంచి ఈ ట్యాంకును తెప్పించి జేసీ ఆధ్వర్యంలో యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో జేసీ మహేష్‌కుమార్‌, వైసీపీ జిల్లా వ్యవహారాల సమన్వయకర్త చిన్న శ్రీను, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సీతారామరాజు, డాక్టరు నాగభూషణరావు, ఆర్‌ఎంఓ గౌరీశంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-18T05:13:13+05:30 IST