విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటాం

ABN , First Publish Date - 2021-08-04T06:24:37+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ప్రజా ఉద్యమాల ద్వారా అడ్డుకుంటామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఏ.గఫూర్‌ అన్నారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేస్తున్న సీఐటీయూ నాయకులు

  1. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్‌


కర్నూలు(న్యూసిటీ), ఆగస్టు 3: కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ప్రజా ఉద్యమాల ద్వారా అడ్డుకుంటామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఏ.గఫూర్‌ అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా  పార్లమెంటు దగ్గర జరుగుతున్న ధర్నాకు మద్దతుగా మంగళవారం సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్‌ రాధాక్రిష్ణ అధ్యక్షతన కలెక్టరేట్‌ ఎదురుగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గఫూర్‌ మాట్లాడుతూ ఎంతో మంది ఆత్మబలిదానంతో ఏర్పాటు చేసుకున్న ఉక్కు పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం కారుచౌకగా అమ్మాలని చూస్తోందని విమర్శించారు. సీనియర్‌ నాయకులు రామాంజనేయులు, అంజిబాబు, పి.నిర్మల, పుల్లారెడ్డి, రాజశేఖర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-04T06:24:37+05:30 IST