ప్రభుత్వ, అసైన్డ్‌ భూములను కాపాడుతాం

ABN , First Publish Date - 2021-08-04T06:27:18+05:30 IST

ప్రభుత్వ, అసైన్డ్‌ భూముల్లో అక్రమంగా అన్యాక్రాంతమైన భూములను గుర్తించి కాపాడుతామని తహసీల్దార్‌ పుల్లారావు చెప్పారు.

ప్రభుత్వ, అసైన్డ్‌ భూములను కాపాడుతాం
భూములు పరిశీలిస్తున్న తహసీల్దార్‌

తహసీల్దార్‌ పుల్లారావు

కనిగిరి, ఆగస్టు 3: ప్రభుత్వ, అసైన్డ్‌ భూముల్లో అక్రమంగా అన్యాక్రాంతమైన భూములను గుర్తించి కాపాడుతామని తహసీల్దార్‌ పుల్లారావు చెప్పారు. పట్టణ సమీపంలోని వివిధ ప్రభుత్వ భూములను మంగళవారం ఆయన పరిశీలించారు. వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలకు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అసైన్డ్‌, ప్రభుత్వ భూముల్లో అకమ్రంగా వేసిన వెంచర్లను గుర్తించి వాటిని రద్దు చేస్తామన్నారు. వ్యవసాయం కోసం పేద రైతులకు ఇచ్చిన భూమి అన్యాక్రాంతంపై, ప్రస్తుతం ఆ భూమిలో ఉన్న పరిస్తితిని విచారించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2021-08-04T06:27:18+05:30 IST