Abn logo
Oct 26 2021 @ 23:29PM

గిరిజన గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తాం

వాల్గొండ హీరాపూర్‌లో వైద్య శిబిరాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ రాజేష్‌ చంద్ర

ఆదిలాబాద్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): వైద్యానికి సుదూర ప్రాంతాల్లో ఉంటున్న గిరిజన గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఆదివాసీలకు అండగా ఉంటున్నామని ఎస్పీ రాజేష్‌చంద్ర పేర్కొన్నారు. మంగళవారం ఇంద్రవెల్లి మండలం వాల్గొండ హీరాపూర్‌ గ్రామంలో ఉట్నూర్‌ డివిజన్‌ పోలీసుల ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా హాజరై ఎస్పీ గ్రామస్థులతో కలిసి వైద్య శిబిరాన్ని ప్రారం భించారు. శిబిరంలో 17 గ్రామాల ప్రజలు దాదాపు 900 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీ గిరిజన యువకులకు విద్య, వైద్యంతోనే అదనంగా బలం చేకూరుతుందని తెలిపారు. మంచి ఆరోగ్యం, విద్య సౌకర్యంతోనే ఆదివాసీ యువకులు అన్ని రంగాల్లో రాణించే అవకాశం ఉందన్నారు. త్వరలో అర్హులైన వారికి కానిస్టేబుల్‌ ఎంపిక కోసం ఉచితంగా శిక్షణ, మంచి బోధన అందిస్తామని తెలిపారు. చెడు వ్యసనాలకు ఆదివాసీ యువకులు దూరంగా ఉండాలని, గ్రామాల్లో సమస్యలున్నచో పోలీసుల ద్వారా పరిష్కరించుకోవాలని, ఆదివాసీ ప్రజలు, యవకులు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్‌ ఏఎస్పీ హర్షవర్దన్‌, అదనపు వైద్యాధికారి కుడ్మెత మనోహర్‌, డాక్టర్లు ధన్‌రాజ్‌, రణ్‌వీర్‌, సబితా, ధీపక్‌ పుష్కర్‌, రమేష్‌ పవార్‌, ఉట్నూర్‌ సీఐ ఐ సైదారావ్‌, ఇంద్రవెల్లి ఎస్సై నందిగామ నాగ్‌నాథ్‌, జడ్పీటీసీ పుష్పలత, సర్పంచ్‌ గొడం నాగోరావ్‌, ఎంపీటీసీ గొడం మధుకర్‌, గ్రామపటేళ్లు తొడసం ఇస్రు, సిడాం భీంరావ్‌, అర్క ఖమ్ము, కినక జుగాధిరావ్‌ పాల్గొన్నారు.