ప్రతీ ఫిర్యాదుకు పరిష్కారాన్ని చూపుతాం

ABN , First Publish Date - 2020-08-11T09:52:10+05:30 IST

ప్రజల నుంచి అందిన ప్రతి ఫిర్యాదుకూ సాధ్యమైనంత తొందరగా పరిష్కారాన్ని చూపనున్నట్లు ఖమ్మం కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ తెలిపారు.

ప్రతీ ఫిర్యాదుకు పరిష్కారాన్ని చూపుతాం

ప్రజావాణిలో ఫిర్యాదుదారులకు కలెక్టర్‌ హామీ


ఖమ్మం కలెక్టరేట్‌, ఆగస్టు10: ప్రజల నుంచి అందిన ప్రతి ఫిర్యాదుకూ   సాధ్యమైనంత తొందరగా పరిష్కారాన్ని చూపనున్నట్లు ఖమ్మం కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ తెలిపారు. న్యాయసమస్యలు ఉత్పన్నం కాని వాటికి జిల్లా యంత్రాంగం పరిష్కరించనున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లో తన ఛాంబర్‌ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా కలెక్టర్‌ ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ దరఖాస్తులను ఫిర్యాదులను కలెక్టర్‌కు మెరపెట్టుకున్నారు. సమస్యలపై వాటి స్వభావాన్ని తెలుసుకుని అర్జిదారులకు వివరించారు.


 రఘునాధపాలెం మండలంలోని ఈర్లపూడి గ్రామపంచాయతీలో సర్పంచి ఉపసర్పంచి, కార్యదర్శి గ్రామపంచాయతీలో అనుమతి తీర్మానం లేకుండా రూ 40వేలు డ్రాచేసుకున్నారన్నారు. వీధి దీపాల నిమిత్తం రూ 72వేలు డ్రా చేసుకుని సొంతానికి వాడుకున్నారని ఈర్లపూడి గ్రామానికి చెందిన మెగిలిశెట్టి వెంకటేశ్వర్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.


 కామేపల్లి మండలం టేకుల తండాలో సర్వెనెంబర్‌ 52/ఇ/3లో ఎకరం 30 గుంటల భూమికి పట్టాపాస్‌ పుస్తకం ఇప్పించాలని లకావత్‌ వెంకట్రామ్‌ కలెక్టర్‌ను కోరారు.


 గోళ్లపాడు నిర్వాసితులకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లను కేటాయించాలని బాధితులు కలెక్టర్‌కు పిర్యాదు చేశారు.

 

 సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లికి చెందిన పి.లక్ష్మయ్య తన సర్వేనెంబర్‌లో 315లో భూమివివాదంలో ఉందని దాన్ని సవరణ చేసి తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశాడు. కార్యాలయం చుట్టు తిరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని విచారణ చేపట్టాలని మెరపెట్టుకున్నారు.


 ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో ప్రవేటు విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని వాటిపై చర్యలు తీసుకోవాలంటూ పలు విద్యార్థి సంఘాల నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2020-08-11T09:52:10+05:30 IST