పేదల ఆరోగ్యానికి ఎంతైనా ఖర్చు చేస్తాం

ABN , First Publish Date - 2021-11-29T04:40:26+05:30 IST

పేదల ఆరోగ్యం కోసం ఎంత ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడలు, సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

పేదల ఆరోగ్యానికి ఎంతైనా ఖర్చు చేస్తాం
దర్గాలో పూజలు చేస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

- సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌


మహబూబ్‌నగర్‌ టౌన్‌, నవంబరు 28 : పేదల ఆరోగ్యం కోసం ఎంత ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడలు, సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం ఆయన జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో మహబూబ్‌నగర్‌, హన్వాడ మండలాలు, ఆదే విధంగా మహబూబ్‌నగర్‌ పట్టణానికి సంబంధించి సుమారు 72 మంది లబ్ధిదారులకు 43 లక్షల 31 వేల 500 రూపాయలు విలువ చేసే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ గతంలో అనారోగ్యం కారణంగా ఎంతో మంది చనిపోయారని, తమ ప్రభు త్వం వచ్చిన తర్వాత ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్న వారికి కూడా రూ.10 వేల నుంచి మొదలుకొని 3 లక్షల వరకు సహాయం అందిస్తున్నామని తెలిపారు. మహబూబ్‌నగర్‌ మునిసిపల్‌ చైర్మన్‌ కె.సి.నరసింహులు, కౌన్సిలర్లు కిషోర్‌, శ్రీనివాస్‌రెడ్డి, రామ్‌లక్ష్మణ్‌, మండల ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్ర మానికి హాజరుయ్యారు.


గౌడ విద్యార్థులకు పురస్కారాలు


మహబూబ్‌నగర్‌, నవంబరు 28 : వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన గౌడ విద్యార్థులకు మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌  ప్రతిభాపురస్కారాలు అందజేశా రు. ఆదివారం కేసీఆర్‌ ఆర్బన్‌ ఎకో పార్క్‌లో నార్త్‌ అమెరికా కౌండిన్య సంఘం తరపున విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. అదేవిధంగా అర్బన్‌ ఎకో పార్క్‌లో బుకింగ్‌ కౌంటర్‌లో పనిచేసే కార్తీక్‌ గౌడ్‌ ఇటీవల మరణించ డంతో ఆయన కుటుంబ సభ్యులకు గౌడ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో లక్ష రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమం లో గౌడ సంఘం అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్‌, విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకటస్వామిగౌడ్‌, ప్రధాన కార్యదర్శి రాజయ్యగౌడ్‌, రాష్ట్ర సంఘం అధ్యక్షుడు చలముల వెంకటేశ్వర్లు, కార్యదర్శి మహేశ్వర్‌గౌడ్‌, జిల్లా కమిటీ సభ్యులు సత్యనారాయణ, బాలరాజు పాల్గొన్నారు. 


ఘనంగా హజ్రత్‌ మహబూబ్‌ సుభాని దర్గా గ్యార్మీ


పాలమూరు, నవంబరు 28 : పట్టణంలోని పోలీస్‌లైన్‌ పాఠశాల ఆవరణలో హాజ్రత్‌మహబూబ్‌సుభాని దర్గా వద్ద ఆదివారం గ్యార్మీ వేడుకలను మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ ప్రారంభించారు. రాత్రి కాలనీ యువత ఆధ్వర్యంలో గంధాన్ని దర్గాలో సమర్పించి ప్రత్యేక ఫాతెహా దువాలను సర్‌ ఖలీఫా రఫాయి మహ్మద్‌ జమీలుల్లా షా అహ్మద్‌ ఖాద్రీ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం అన్నదా నం చేపట్టారు. కార్యక్రమంలో మత పెద్దలు, కాలనీ యువత హఫెజ్‌ఖదీర్‌ ఖాద్రి, ఖాజాఅలీ, అబ్దుల్‌ఖదీర్‌, మహ్మద్‌ఇసాఖ్‌, ఎండీ సిరాజుద్దీన్‌,యండి ఖదీర్‌, యండి ఖాజా, యం.డి జహంగీర్‌, యం.డి జఖీ, యండి ఇసాఖ్‌ఖాద్రీ, యండి అదీల్‌, సాధిఖ్‌అలీ, ఇసాఖ్‌ఖాద్రి, జహంగీర్‌, నజీర్‌, షబ్బీర్‌, నజ్ముద్దీన్‌, మతీన్‌ అహ్మద్‌ఖాద్రి, కలీమ్‌అహ్మద్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-29T04:40:26+05:30 IST