ఆలయ నిర్మాణ పనులు ప్రారంభిస్తాం

ABN , First Publish Date - 2022-01-20T06:07:40+05:30 IST

వెలుగొమ్ముల గ్రామంలోని లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించేందుకు చర్యలు చేపడుతామని ఎమ్మెల్యే డాక్టర్‌ సి. లక్ష్మారెడ్డి తెలిపారు.

ఆలయ నిర్మాణ పనులు ప్రారంభిస్తాం
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతున్న దృశ్యం

- చెన్నకేశవస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి


మిడ్జిల్‌, జనవరి 19 : వెలుగొమ్ముల గ్రామంలోని లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించేందుకు చర్యలు చేపడుతామని ఎమ్మెల్యే డాక్టర్‌ సి. లక్ష్మారెడ్డి తెలిపారు. లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల చివరిరోజు బుధవారం రాష్ట్ర సంగీతనాటక అకాడమీ చైర్మన్‌ శివకుమార్‌, జడీ వైస్‌ చైర్మన్‌ యాదయ్యలతో కలిసి ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని ఆలయ కమిటీ సభ్యులు, ఆర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్పంచ్‌ ఆంజమ్మ, ఎంపీపీ కాంతమ్మ, ఆలయ చైర్మన్‌ రఘుపతిరెడ్డి పలువురు నాయకులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పాండు, ఊర్కొండ మండల అధ్యక్షుడు గిరినాయక్‌, పీఎసీఎస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు బాల్‌రెడ్డి, ఎల్లయ్య యాదవ్‌, శ్రీనివాస్‌గుప్తా, శ్రీనివాసులు, సుదర్శన్‌, నాగేశ్వర్‌గౌడ్‌, బంగారు, మన్యం, మల్లేష్‌, ఆంజనేయులు, నారాయణ్‌రెడ్డి, జంగయ్య, లక్ష్మారెడ్డి, సాయులు, నర్సింహారెడ్డి, కృష్ణయ్య, రాజేందర్‌రెడ్డి ఉన్నారు. 


పీహెచ్‌సీ ఏర్పాటుకు భవనం పరిశీలన


జడ్చర్ల : మండలంలోని పెద్దఆదిరాల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కోసం బుధవారం భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి పరిశీలించారు. ఇదిలా ఉండగా మండలంలోని లింగంపేట గ్రామంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోడ్గల్‌ యాదయ్య, సర్పంచ్‌ కృష్ణబాయి, టీఆర్‌ఎస్‌ నాయకులు శంకర్‌నాయక్‌, ప్రణీల్‌చందర్‌, వెంకట్‌రెడ్డి, రఘుపతిరెడ్డి, హీర్యానాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-20T06:07:40+05:30 IST