Abn logo
Oct 23 2021 @ 00:37AM

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కఠినంగా అమలు చేస్తాం

హుజూరాబాద్‌లో డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ను పరిశీలిస్తున్న అధికారులు

 - ఉప ఎన్నికల సాధారణ పరిశీలకుడు ముత్తుకృష్ణన్‌ శంకర్‌నారాయణ

హుజూరాబాద్‌ రూరల్‌, అక్టోబరు 22: హుజూరాబాద్‌ శాసనసభ ఉప ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడంతో పాటు ఎన్నికల ప్రవర్తన నియమావళిని కఠినంగా అమలు చేస్తామని హుజూరాబాద్‌ ఉప ఎన్నికల కేంద్ర సాధారణ పరిశీలకుడు ముత్తు కృష్ణన్‌ శంకర్‌నారాయణ అన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల సందర్భంగా శక్రవారం హుజూరాబాద్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో పీవోలకు, ఏపీవోలకు నిర్వహించిన శిక్షణ తరగతులను జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం హుజూ రాబాద్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ను సందర్శించి ఈవీఎంల కమిషనింగ్‌ ప్రక్రిను పరిశీలించారు. ఈ సందర్భంగా ముత్తు కృష్ణన్‌ శంకర్‌నారా యణ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలోనే కాకుండా హన్మకొండ, కరీంనగర్‌ జిల్లాల వ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో హుజూరాబాద్‌ రిటర్నింగ్‌ అధికారి సీహెచ్‌ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.