లొంగిపోయిన మావోయిస్టులను అన్ని విధాలుగా ఆదుకుంటాం

ABN , First Publish Date - 2021-06-19T05:30:00+05:30 IST

మావోయిస్టులు ప్రభుత్వానికి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిస్తే వారిని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుం టుందని జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ సీహెచ్‌. ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.

లొంగిపోయిన మావోయిస్టులను అన్ని విధాలుగా ఆదుకుంటాం
పట్టాపాసు పుస్తకాన్ని అందిస్తున్న ఎస్పీ

నిర్మల్‌ కల్చరల్‌, జూన్‌ 19 : మావోయిస్టులు ప్రభుత్వానికి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిస్తే వారిని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుం టుందని జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ సీహెచ్‌. ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. శనివారం ఆయన లొంగిన మావోయిస్టులకు ఐదెకరాల భూమి పత్రాలను తన కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 2019లో ఒగు సట్వాజి అతని భార్య డీజీపీ సమక్షంలో లొంగిపోయినారని వారిపై ఉన్న నగదు పారితోషకంతో పాటు ఇంటి స్థలం అందించామని అన్నారు. వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా ఐదెకరాల భూమి, పట్టా పాసుపుస్తకాన్ని అందించారు. సిద్ధాంతాలను పక్కన బెట్టి ఎవరు ఇచ్చినా వారికి ప్రభుత్వం అండగా ఉండి ఆదుకుంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పథకాలు వారి దరిచేరుతాయని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్స్‌పెక్టర్‌ రమేష్‌, నిర్మల్‌ రూరల్‌ సీఐ వెంకటేష్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-06-19T05:30:00+05:30 IST