దళితుల అభ్యున్నతికిచిత్తశుద్ధితో పనిచేస్తాం

ABN , First Publish Date - 2022-01-26T05:53:21+05:30 IST

తమ ప్రభుత్వానికి దళిత జాతిని, పేద వర్గాలను అభివృద్ధి చేయాలని చిత్త శుద్ధి ఉందని రాష్ట్ర ఆబ్కారి శాఖ మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు.

దళితుల అభ్యున్నతికిచిత్తశుద్ధితో పనిచేస్తాం
మాట్లాడుతున్న ఎక్సైజ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌గౌడ్‌

- దళితబంధుపై సమీక్షలో ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌


మహబూబ్‌నగర్‌ టౌన్‌, జనవరి 25 : తమ ప్రభుత్వానికి దళిత జాతిని, పేద వర్గాలను అభివృద్ధి చేయాలని చిత్త శుద్ధి ఉందని రాష్ట్ర ఆబ్కారి శాఖ మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో దళితబంధు పథకంపై సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ప్రసంగి స్తూ ఇదివరకు అధికారం చెలాయించిన వివిధ పార్టీలు దళితులను ఓటు బ్యాంకు గానే ఉపయోగించుకున్నా యని ఆరోపించారు. 75 సంవత్సరాలు గా ఎన్నో ప్రభుత్వాలు వచ్చిపోయా యని, కానీ, దళితులు వెనుకబాటుతో నే ఉన్నారని అన్నారు. ఇప్పటికీ వివక్ష, చిన్న చూపు చూస్తుండడం దుర్మార్గమని అన్నారు. దళితులను ఆదుకోవా లనే సంకల్పంతో 100 రకాల స్కీములను ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం అంచెలవారిగా అందరికి అందిస్తామని తెలిపారు. మాకు చిత్త శుద్ధి ఉంది కాబట్టి ఎస్సీ వర్గీకరణకు, రిజర్వేషన్ల పెంపునకు, మహిళా బిల్లుకు మద్దతు, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్‌.రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, అంజయ్య యాదవ్‌, పట్నం నరేందర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ స్వర్ణా సుధాకర్‌రెడ్డి, నారాయణ పేట జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ, మహబూబ్‌ నగర్‌ వైస్‌ చైర్మన్‌ యాదయ్య పాల్గొన్నారు.


పర్యాటకం అభివృద్థికి చర్యలు


రాష్ట్రంలో అన్ని రకాల పర్యాట కాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పరిషత్‌ సమావేశం మందిరం వద్ద మంగళవారం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒక రోజు ఉచిత పర్యాటక బస్సును మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు, జిల్లా పర్యాటక అభివృద్థి శాఖ అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


మర్లులో సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన


మహబూబ్‌నగర్‌ : పట్టణంలోని వార్డు నెంబర్‌ 9 మర్లులో రూ.45 లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్డు పనులకు మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌, షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయయ్య యాదవ్‌తో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ  కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ కోరమోని నర్సింహులు, కౌన్సిలర్లు నరేందర్‌, అనంత్‌రెడ్డి, రామ్‌లక్ష్మణ్‌ పాల్గొన్నారు. 


కేసీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం


రాష్ట్రంలో ప్రతీ నియోజకవర్గానికి 100 మంది దళితులకు దళితబంధు ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌,  మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ల చిత్రపటాలకు మంగళవారం ఎదిరలో గ్రామస్థులు క్షీరాభిషేకం చేశారు.  ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ యాదమ్మ, మాజీ కౌన్సిలర్‌ శివశంకర్‌, నాయకులు హన్మంతు, కాశన్న, భానుచందర్‌, పెద్ద కృష్ణ, వెంకటయ్య, రాములు, మాసయ్య, ఎల్లయ్య, శేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-26T05:53:21+05:30 IST