Abn logo
Aug 12 2021 @ 10:30AM

IMD bulletin: పలు రాష్ట్రాల్లో ఆగస్టు 15వరకు భారీ వర్షాలు

న్యూఢిల్లీ : పలు రాష్ట్రాల్లో ఆగస్టు 15వరకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) గురువారం నాటి వెదర్ బులెటెన్‌లో వెల్లడించింది. దేశ వ్యాప్తంగా రుతుపవనాల ప్రభావం బలహీనపడుతున్న నేపథ్యంలో వచ్చే ఐదురోజుల పాటు ఈశాన్య, తూర్పు భారతతం, ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఆగస్టు 15 వరకు వర్షాలు కురవవచ్చని ఐఎండీ తెలిపింది.తమిళనాడు, కేరళలలో వచ్చే ఐదురోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.జూన్ 1నుంచి ఆగస్టు 10 వతేదీ వరకు దేశంలో సాధారణం కంటే 5శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. 

ఆగస్టు 12,13 తేదీల్లో అసోం, మేఘాలయల్లో భారీవర్షాలు కురవవచ్చునని అధికారులు చెప్పారు. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఆగస్టు 14వతేదీ వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు.గురువారం బీహార్ లో భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. హిమాలయన్ పశ్చిమబెంగాల్, సిక్కింలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు వివరించారు.రాబోయే ఐదురోజుల్లో పశ్చిమ, మధ్య హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో భారీవర్షాలు కురిస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు.