Abn logo
Sep 19 2021 @ 01:03AM

నల్లదొరల పాలనలోనూ మాయమవుతున్న దేశసంపద

సదస్సులో మాట్లాడుతున్న ఓబులేసు

నల్లదొరల పాలనలోనూ మాయమవుతున్న దేశసంపద 

కందుకూరు, సెప్టెంబరు 18: తెల్లోడి పాలన అంతమై నల్లదొరల పాలన కొనసాగుతున్న భారతదేశంలో దేశసంపద మాయమోతోందని  ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు విమర్శించారు. ‘ప్రై వేటీకరణ - దుష్పలితాలు’ అనే అంశంపై శనివారం కందుకూరులో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి పి.మాలకొండయ్య అధ్యక్షతన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఓబులేసు మాట్లాడుతూ 74 సంవత్సరాల స్వాతంత్య్ర భారతదేశంలో దేశసంపదను కొల్లగొడుతున్న పాలకుడిగా నరేంద్రమోదీ ఘనతికెక్కాడన్నారు. మోదీ ఏడున్నర సంవత్సరాల పాలనలో ఒక్క ప్రభుత్వరంగ సంస్థను నెలకొల్పలేదన్నారు. ఇన్నేళ్లుగా వివిధ ప్రభుత్వాలు సమకూర్చిన దేశ సంపదను బహిరంగ మార్కెట్లో పెట్టి కార్పోరేట్‌ శక్తులకు అమ్మేస్తున్నాడని విమర్శించారు. దశాబ్ధాల ఉద్యమంతో, ఆత్మబలిదానంతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కూడా ప్రైవేటు సంస్థలకు అమ్మేస్తుండడం ప్రజలను నిలువునా ముంచడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ సంపదను కాపాడుకునేందుకు యువత, విద్యార్థులు సమైఖ్యంగా ఉద్యమించాలన్నారు. కేంద్రం ఆడమన్నట్లు రాష్ట్రముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆడుతూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెడుతున్నాడని విమర్శించారు. ఐఎ్‌ఫటీయూ జాతీయ కార్యదర్శి ప్రసాదు మాట్లాడుతూ స్వాతంత్ర్యానంతరం మన రాజ్యాంగం ద్వారా సంక్రమించిన రిజర్వేషన్లును రద్దు చేసేందుకు నేటి పాలకులు కుట్రపన్నుతున్నారని విమర్శించారు. ఈ సదస్సులో వివిధ ప్రజాసంఘాల నాయకులు ఎస్‌.రావమ్మ, బి.సురే్‌షబాబు, ఎ్‌సఏ గౌస్‌, పాలేటి కోటేశ్వరరావు, బి.వెంకటేశ్వర్లు, పేరం సత్యం, ఎం.కిషోర్‌, కె.మాల్యాద్రి, వై.ఆనంద్‌మోహన్‌, దుర్గాప్రసాద్‌, చంద్రమోహన్‌, సుభాని, మాలకొండరాయుడు పాల్గొన్నారు.