వ్యాక్సినేషన్‌‌లో దూసుకుపోతున్న ధనిక దేశాలు

ABN , First Publish Date - 2021-04-11T07:44:50+05:30 IST

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇప్పటికీ వణికిస్తూనే ఉంది. ఈ మహమ్మారి నుంచి బయటపడేందుకు

వ్యాక్సినేషన్‌‌లో దూసుకుపోతున్న ధనిక దేశాలు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇప్పటికీ వణికిస్తూనే ఉంది. ఈ మహమ్మారి నుంచి బయటపడేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికి వ్యాక్సినేషన్ ప్రక్రియలో మాత్రం ధనిక దేశాలు దూసుకుపోతున్నాయి. మిగతా దేశాలతో పోల్చితే ధనిక దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ 25 రెట్ల వేగంగా జరుగుతున్నట్టు డేటా చెబుతోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లలో 40 శాతం వ్యాక్సిన్లు కేవలం 27 ధనిక దేశాలే ఉపయోగించుకున్నట్టు డేటా వెల్లడించింది. ఈ 27 దేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 11 శాతం జనాభా వ్యాక్సిన్ తీసుకున్నట్టు డేటా తెలిపింది. 


ఈ 27 ధనిక దేశాల్లోని 11 శాతం జనాభా మొత్తం వ్యాక్సిన్లలో 40 శాతం ఉపయోగించుకోగా.. మిగతా దేశాల్లోని 11 శాతం జనాభా కేవలం 1.6 శాతం వ్యాక్సిన్లను మాత్రమే ఉపయోగించుకున్నట్టు తెలుస్తోంది. వ్యాక్సినేషన్ విషయంలో ‘మా దేశమే ముందు’ అన్న నినాదంతో ధనిక దేశాలు ముందుకు వెళ్తున్నాయి. ఈ కారణంగానే పేద దేశాలకు అవసరమైన రీతిలో వ్యాక్సిన్లు అందడం లేదు. ఇప్పటికే ఈ విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. వ్యాక్సిన్ల పంపిణీలో అన్ని దేశాలకు ఒకే రకమైన న్యాయం జరగాలంటూ డబ్ల్యూహెచ్ఓ ధనిక దేశాలను కోరింది.  

Updated Date - 2021-04-11T07:44:50+05:30 IST