కంప్యూటర్‌ కోడింగ్‌పై నేడు వెబినార్‌

ABN , First Publish Date - 2021-06-18T06:25:10+05:30 IST

రాష్ట్ర శాస్త్రసాంకేతిక మండలి, పాఠశాల విద్య సహకారంతో శుక్రవారం ఉదయం 9.30గంటలకు కంప్యూటర్‌ కోడింగ్‌పై విద్యార్థులకు వెబినార్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా సమన్వయ కర్త నీలకంఠ పేర్కొన్నారు.

కంప్యూటర్‌ కోడింగ్‌పై నేడు వెబినార్‌

తిరుపతి(విద్య), జూన్‌ 17: రాష్ట్ర శాస్త్రసాంకేతిక మండలి, పాఠశాల విద్య సహకారంతో శుక్రవారం ఉదయం 9.30గంటలకు కంప్యూటర్‌ కోడింగ్‌పై విద్యార్థులకు వెబినార్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా సమన్వయ కర్త నీలకంఠ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 600మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరయ్యే ఈ వెబినార్‌లో రాష్ట్ర పాఠశాల విద్య కమిషనర్‌ చినవీరభద్రుడు ముఖ్యఅతిథిగా పాల్గొంటారన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకోసం 88860 26275 నెంబరును సంప్రదించాలని గురువారం ఒక ప్రకటనలో సూచించారు. 

Updated Date - 2021-06-18T06:25:10+05:30 IST