ఎన్నారైల సమస్యలను తీర్చేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ ఏర్పాటు

ABN , First Publish Date - 2021-03-03T13:39:53+05:30 IST

ప్రవాస భారతీయుల సమస్యలను తీర్చేందుకు పంజాబ్ ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌ను లాంచ్ చేసింది. పంజాబ్ స్టేట్ కమిషన్ ఫర్ ఎన్నారైస్ ఆధ్వర్యంలో www.nricommissionpunjab.com వెబ్‌సైట్‌ను

ఎన్నారైల సమస్యలను తీర్చేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ ఏర్పాటు

చండీఘడ్: ప్రవాస భారతీయుల సమస్యలను తీర్చేందుకు పంజాబ్ ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌ను లాంచ్ చేసింది. పంజాబ్ స్టేట్ కమిషన్ ఫర్ ఎన్నారైస్ ఆధ్వర్యంలో www.nricommissionpunjab.com వెబ్‌సైట్‌ను మంగళవారం ఎన్నారై అఫైర్స్, స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీస్ మినిస్టర్ రాణా గుర్మిత్ సింగ్ సోదీ ప్రారంభించారు. ఎన్నారైలకు సంబంధించిన కుటుంబ, ఆస్తి, ఇమ్మిగ్రేషన్, మ్యాట్రిమోనీ, ఉద్యోగ తదితర సమస్యలను ఈ వెబ్‌సైట్ ద్వారా ప్రభుత్వం పరిష్కరించనున్నట్టు రాణా గుర్మిత్ సింగ్ తెలిపారు. పంజాబ్ స్టేట్ కమిషన్ ఫర్ ఎన్నారై‌స్‌ను 2011లో స్థాపించారు. అయితే సమాచార లోపం కారణంగా ఎన్నారైల సమస్యలను పరిష్కరించడంలో జాప్యం జరుగుతూ వచ్చింది. 


తాజాగా ఏర్పాటు చేసిన వెబ్‌సైట్ ద్వారా ఎన్నారైల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని రాణా గుర్మిత్ సింగ్ చెప్పారు. విదేశాల్లో ఉన్న ఎన్నారైలు ఈ వెబ్‌సైట్ ద్వారా తమ సమస్యలను రిజిస్టర్ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. సమస్యను రిజిస్టర్ చేసుకున్న వెంటనే ఫిర్యాదుదారునికి యునిక్ నంబర్ వెళ్తుందని అన్నారు. ఈ నెంబర్ ద్వారా సమస్యకు పరిష్కారం ఎంత వరకు వచ్చిందో చూసుకోవచ్చని తెలిపారు. ఈ వెబ్‌సైట్‌లో కేవలం పంజాబ్‌కు చెందిన ప్రవాసులు మాత్రమే తమ సమస్యలను రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉన్నట్టు కమిషన్ చైర్మన్ జస్టిస్ శేఖర్ కుమార్ దావన్(రిటైర్డ్) స్పష్టం చేశారు.

Updated Date - 2021-03-03T13:39:53+05:30 IST