మార్చి 23న పెళ్లి... 71 రోజుల‌కు అత్తారింటికి... మ‌ధ్య‌లో ఊహించ‌ని మ‌లుపులు!

ABN , First Publish Date - 2020-05-30T16:59:53+05:30 IST

హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని ఉనా జిల్లాలోని పరోవియా గ్రామానికి చెందిన సునీల్ కుమార్‌కు కోల్‌కతాలో వివాహం జ‌రిగింది. ఆ త‌రువాత ఊహించ‌ని విధంగా నూత‌న దంప‌తులు చిక్కుల్లో ప‌డ్డారు. వివ‌రాల్లోకి వెళితే సునీల్...

మార్చి 23న పెళ్లి... 71 రోజుల‌కు అత్తారింటికి... మ‌ధ్య‌లో  ఊహించ‌ని మ‌లుపులు!

ఉనా: హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని ఉనా జిల్లాలోని పరోవియా గ్రామానికి చెందిన సునీల్ కుమార్‌కు కోల్‌కతాలో వివాహం జ‌రిగింది. ఆ త‌రువాత ఊహించ‌ని విధంగా నూత‌న దంప‌తులు చిక్కుల్లో ప‌డ్డారు. వివ‌రాల్లోకి వెళితే సునీల్ త‌న వివాహం సంద‌ర్భంగా 18 మంది బంధువుల‌తో స‌హా మార్చి 20న రైలులో కోల్‌కతా వెళ్లారు. మార్చి 23 న సునీల్‌, సునిప్తాల వివాహం జ‌రిగింది. మార్చి 25న వారు ఊనాకు చేరుకోవాల్సివుంది. అయితే అదే రోజు నుండి మోదీ ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో ర‌వాణా సౌక‌ర్యాల‌న్నీ నిలిచిపోయాయి. ఫ‌లితంగా సునీల్ కుమార్‌తోపాటు అత‌ని భార్య‌, బంధువులు కోల్‌క‌తాలో చిక్కుకుపోయారు. ఇటీవ‌లి లాక్‌డౌన్ స‌డ‌లింపుల నేపధ్యంలో బ‌స్సులో మే 16 న మెహత్‌పూర్ చేరుకున్నాక వారిని క్వారంటైన్ సెంట‌ర్‌కు త‌ర‌లించారు.  అయితే మే 23న వరుడి సోదరుడికి క‌రోనా పాజిటివ్ రిపోర్టు వ‌చ్చింది. దీంతో అత‌నిని కోవిడ్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మిగ‌లిన‌ వారికి క‌రోనా నెగిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో వారు ఇంటికి వెళ్ల‌డానికి వైద్యాధికారులు అనుమ‌తినిచ్చారు. మొత్తానికి 71 రోజుల తరువాత వధువు అత్తారింట్లో కాలు మోప‌గ‌లిగింది. 


Updated Date - 2020-05-30T16:59:53+05:30 IST