వేదికపైనే వరుడిని వాటేసుకున్న మహిళ.. ఎంతకూ వదలకపోవడంతో అవాక్కైన వధువు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి!

ABN , First Publish Date - 2022-01-09T19:45:08+05:30 IST

నూతన వధూవరులకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వివాహం తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై నూతన వధూవరులు నిల్చొని ఉండగా.. ఓ మహిళ వచ్చి వరుడిని కౌగిలించుకోవడాన్ని చూసి తొలుత వధువు లైట్ తీసుకుం

వేదికపైనే వరుడిని వాటేసుకున్న మహిళ.. ఎంతకూ వదలకపోవడంతో అవాక్కైన వధువు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి!

ఇంటర్నెట్ డెస్క్: నూతన వధూవరులకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వివాహం తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై నూతన వధూవరులు నిల్చొని ఉండగా.. ఓ మహిళ వచ్చి వరుడిని కౌగిలించుకోవడాన్ని చూసి తొలుత వధువు లైట్ తీసుకుంది. అయితే సదరు మహిళ వరుడిని ఎంతకూ వదలకపోవడంతో పెళ్లి కూతరు అవాక్కైంది. ఆ తర్వాత ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..



యువతి, యువకుడు ఒకరికొకరు నచ్చడంతో ఇరు కుటుంబ సభ్యులు పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు. కాగా.. పెళ్లి అనంతరం మండపం వద్ద ఏర్పాటు చేసిన వేదికపైకి వచ్చి నూతన వధూవరులు పెద్దల ఆశీర్వాదం తీసుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో బురఖా ధరించి స్టేజీ మీదకు వెళ్లిన ఓ మహిళ.. తొలుత వధువుకు షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఆ తర్వాత వరుడిని గట్టిగా కౌగిలించుకుంది. సరదు మహిళ ఎంతకూ వరుడిని వదలకపోవడంతో పెళ్లి కూతురు షాకై తల పక్కకు తిప్పుకుంది. ఆ తర్వాత బురఖా ధరించి స్టేజిపైకి వచ్చిందెవరో గుర్తించి ఆశ్చర్యపోయింది. పెళ్లి కొడుకు స్నేహితుడు మారు వేషంలో వచ్చినట్టు గ్రహించి ముసిముసి నవ్వులు నవ్వింది. అక్కడున్న కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. 






Updated Date - 2022-01-09T19:45:08+05:30 IST