ఛండీగఢ్‌లో వీకెండ్ లాక్‌డౌన్

ABN , First Publish Date - 2021-04-16T21:08:24+05:30 IST

కరోనా వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా ఛండీగఢ్‌లో వీకెండ్ లాక్‌డౌన్‌ను అధికార యంత్రాంగం..

ఛండీగఢ్‌లో వీకెండ్ లాక్‌డౌన్

ఛండీగఢ్: కరోనా వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా ఛండీగఢ్‌లో వీకెండ్ లాక్‌డౌన్‌ను అధికార యంత్రాంగం ప్రకటించింది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం తెల్లవారుజామున 5 గంటల వరకూ ఈ లౌక్‌డౌన్ అమల్లో ఉంటుందని ఒక అధికార ఉత్తర్వులో పేర్కొంది. లాక్‌డౌన్ సమయంలో కేవలం నిత్యావసరాల సర్వీసులను మాత్రమే అనుమతిస్తారు. ఛండీగఢ్ అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో ఈ వీకెండ్ లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నారు.


పంజాబ్, హర్యానా ఉమ్మడి రాజధాని అయిన ఛండీగఢ్‌లో గురువారంనాడు 412 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 3,371కి చేరింది. కోవిడ్ కేసులు పెరుగుతూ పోతుంటే లాక్‌డౌన్ అమలు చేస్తామని గురువారంనాడే ఛండీగఢ్ అధికార యంత్రాంగం సంకేతాలిచ్చింది. ఛండీగఢ్‌కు ముందు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ వంటి ఇంతర ప్రాంతాల్లోనూ వీకెండ్ లాక్‌డౌన్‌లు ప్రకటించారు.

Updated Date - 2021-04-16T21:08:24+05:30 IST