నేటి నుంచి చెన్నై- కెవాడియా వీక్లీ ఎక్స్‌ప్రెస్‌

ABN , First Publish Date - 2021-01-17T06:25:07+05:30 IST

చెన్నై-కెవాడియా-చెన్నై మధ్య వీక్లీ ఎక్స్‌ ప్రెస్‌ (వయా గుంతకల్లు, నెం. 29119 /20) రైళ్లను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆదివారం ఢిల్లీలో ప్రారంభించనున్నారు.

నేటి నుంచి చెన్నై- కెవాడియా వీక్లీ ఎక్స్‌ప్రెస్‌

గుంతకల్లు, జనవరి16: చెన్నై-కెవాడియా-చెన్నై మధ్య వీక్లీ ఎక్స్‌ ప్రెస్‌ (వయా గుంతకల్లు, నెం. 29119 /20) రైళ్లను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆదివారం ఢిల్లీలో ప్రారంభించనున్నారు. ఈ రైళ్లు రేణిగుంట, కడప, గుంతకల్లు, రాయచూరు, వాడి, షోలాపూర్‌, పూనా, కళ్యాణ్‌, వసాయ్‌, సూరత్‌, వడోదర, దబో య్‌ మీదుగా వెళ్తాయన్నారు. ఈ రైలు (29 119) చెన్నైలో ప్రతి ఆదివారం రాత్రి 10-30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6-25కు గుంతకల్లుకు చేరుకుని, కెవాడియాకు మంగళవారం ఉదయం 3 గంటలకు చేరుకుంటుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. తిరుగు ప్రయాణపు రైలు నెం, 29120 కెవాడియాలో ప్రతి బుధవారం ఉదయం 9-15కు బయలుదేరి మరుసటిరోజు ఉదయం ఏడున్నరకు గుంతకల్లుకు చేరుకుని,  సాయంత్రం 4 గంటలకు చెన్నై చేరుతుందన్నారు. 


కాచిగూడ-మైసూరు ఎక్స్‌ప్రెస్‌ దారిమళ్లింపు

గుంతకల్లు-డోన్‌ సెక్షన్‌లోని పెండేకల్లు- ఎద్దులదొడ్డి స్టేషన్ల మధ్య జరు గుతున్న డబ్లింగ్‌ పనుల కారణంగా ఈ నెల 20, 21వ తేదీల్లో కాచిగూడ- మైసూరు ఎక్స్‌ప్రెస్‌ (నెం. 02785) రైలును దారిమళ్లించనున్నట్లు రైల్వే అధికారులు శనివారం తెలిపారు. ఈ రైలును ఆ రెండు రోజులూ గద్వాల, డోన్‌, గుత్తి మీదుగా కాకుండా గద్వాల, రాయచూరు, గుంతకల్లు, గుత్తి స్టేషన్ల మీదుగా దారి మళ్లించి పంపుతున్నట్లు తెలియజేశారు.



Updated Date - 2021-01-17T06:25:07+05:30 IST