తక్షణమే పోలీసులకు వీక్లీ ఆఫ్‌లు: డీజీపీ

ABN , First Publish Date - 2021-12-02T08:37:57+05:30 IST

‘సిబ్బందికి ఈ రోజు నుంచే వీక్లీ ఆఫ్‌లు అమలు చేయండి’ అంటూ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లకు బుధవారం ఆదేశాలు జారీచేశారు. జగన్‌ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకున్న పోలీసు వారాంతపు సెలవు...

తక్షణమే పోలీసులకు వీక్లీ ఆఫ్‌లు: డీజీపీ

అమరావతి, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): ‘సిబ్బందికి ఈ రోజు నుంచే వీక్లీ ఆఫ్‌లు అమలు చేయండి’ అంటూ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లకు బుధవారం ఆదేశాలు జారీచేశారు. జగన్‌ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకున్న పోలీసు వారాంతపు సెలవు... రాష్ట్రంలో మూన్నాళ్ల ముచ్చట అవడంతో పోలీసు సిబ్బందితోపాటు కుటుంబాల్లోనూ అసహనం వ్యక్తమైంది. తొలుత ఈ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకురావడంతో.. అక్టోబరు 21న పోలీసు అమరుల సంస్మరణ సందర్భంగా.. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో వేలాది మంది పోలీసుల సమక్షంలో ఈ రోజు నుంచే వీక్లీ ఆఫ్‌లు అమలు చేస్తున్నామని సీఎం జగన్‌ ప్రకటించారు. కానీ, రోజులు, వారాలు గడుస్తున్నా స్పందన లేకపోవడంతో పోలీసు సిబ్బంది నుంచి నిట్టూర్పు మొదలైంది. ఈ విషయంపై ‘సీఎం సార్‌ చెప్పారంతే’ అంటూ ‘ఆంధ్రజ్యోతి’ రెండు రోజుల క్రితం వార్త ప్రచురించగా, డీజీపీ సవాంగ్‌ స్పందించారు. వెంటనే వీక్లీ ఆఫ్‌లు అమలు చేయాలంటూ అన్ని పోలీసు యూనిట్లకు ఆదేశాలు జారీచేశారు. దీనిపై పోలీసుల కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతోంది.  

Updated Date - 2021-12-02T08:37:57+05:30 IST