ఫాస్టింగ్‌ వల్ల త్వరగా బరువు తగ్గుతారా..? అసలు నిజమేంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2021-11-10T18:41:41+05:30 IST

కార్బోహైడ్రేట్లు రెండు రకాలు. సింపుల్‌ కార్బ్స్‌ అంటే కుకీస్‌, విటమిన్లు, పీచుపదార్థం లేని క్యాండీలు, స్వీట్లు వంటివి ఈ కోవలోకి వస్తాయి. కాంప్లెక్స్‌ కార్బ్స్‌ అంటే గోధుమతో చేసిన బ్రెడ్‌, బీన్స్‌, ఫ్రూట్స్‌.

ఫాస్టింగ్‌ వల్ల త్వరగా బరువు తగ్గుతారా..? అసలు నిజమేంటో తెలిస్తే..

ఆంధ్రజ్యోతి(10-11-2021)


అపోహ: బరువు తగ్గాలంటే కార్బోహైడ్రేట్లు తక్కువ తీసుకోవాలి.


వాస్తవం: కార్బోహైడ్రేట్లు రెండు రకాలు. సింపుల్‌ కార్బ్స్‌ అంటే కుకీస్‌, విటమిన్లు, పీచుపదార్థం లేని క్యాండీలు, స్వీట్లు వంటివి ఈ కోవలోకి వస్తాయి. కాంప్లెక్స్‌ కార్బ్స్‌ అంటే గోధుమతో చేసిన బ్రెడ్‌, బీన్స్‌, ఫ్రూట్స్‌... వీటిలో పోషకాలు చాలా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచివి. 


అపోహ: లేబుల్‌పై ‘నో ఫ్యాట్‌’ అని రాసి ఉంటే ఎంత తిన్నా బరువు పెరగరు.


వాస్తవం: ‘నో ఫ్యాట్‌’లో షుగర్‌, స్టార్చ్‌ ఉంటుంది. కొన్నింటిలో ఉప్పు వినియోగం కూడా ఉంటుంది. వీటిలో క్యాలరీలు పుష్కలంగా ఉంటాయి. న్యూట్రిషన్‌ లేబుల్‌ చూస్తే ఎన్ని క్యాలరీలు లభిస్తాయో తెలుస్తుంది.


అపోహ: బ్రేక్‌ఫాస్ట్‌ మానేస్తే బరువు పెరుగుతారు.


వాస్తవం: బ్రేక్‌ఫాస్ట్‌ మానేయడం వల్ల బరువు పెరుగుతారని ఏ అధ్యయనంలోనూ రుజువు కాలేదు.  


అపోహ: రాత్రివేళ తింటే బరువు పెరిగిపోతారు.


వాస్తవం: లేట్‌నైట్‌ డిన్నర్‌ చేసే వారు హై క్యాలరీ ఉన్న ఆహారాన్ని తీసుకుంటారు. ఇది అధిక బరువుకు కారణమవుతుంది. కొంతమంది డిన్నర్‌ తరువాత కూడా స్నాక్స్‌ తీసుకుంటారు. 


అపోహ: ఫాస్టింగ్‌ వల్ల త్వరగా బరువు తగ్గుతారు.


వాస్తవం: ఫాస్టింగ్‌ మంచిది కాదు. రోజంతా ఆహారం తీసుకోకపోవడం వల్ల తరువాత భోజనంలో ఎక్కువ తింటారు. దీనివల్ల ఎక్కువ క్యాలరీలు వస్తాయి.

Updated Date - 2021-11-10T18:41:41+05:30 IST